పుష్ప సినిమా విడుదలై రెండు వారాలు దాటినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. మూడవ వారంలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తున్న సినిమాగా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ సినిమాకు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రాబోన్నాయని పండితులు చెబుతున్నారు. బాలీవుడ్ లో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన జెర్సీ సినిమా కూడా వాయిదా పడడంతో బాలీవుడ్ లో పుష్ప సినిమాకు ఈ వారం కూడా ఎదురు లేకుండా పోయింది.

ఇక పుష్ప ఈ శనివారం సాధించిన కలెక్షన్స్ చూసి బాలీవుడ్ కి సైతం దిమ్మతిరిగిపోతుందట. 16వ రోజు హిందీలో ఆరున్నర కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఎంతటి స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.  బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇన్ని రోజుల తర్వాత ఇంత గ్రాస్ రావడం కష్టం. అలాంటిది అల్లు అర్జున్ తొలిసారిగా బాలీవుడ్ లో డైరెక్ట్ గా వెళ్లి సినిమా చేస్తే దానికి ఈ స్థాయి లో కలెక్షన్లు అందుకోవడం విశేషం. అక్షయ్ కుమార్ సూర్యవంశీ చిత్రం కూడా చాలా తక్కువ కలెక్షన్ చేసింది. 

అలాంటిది ఓ డబ్బింగ్ సినిమా సౌత్ హీరో సినిమా ఆరున్నర కోట్ల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా పెద్ద విశేషం ఏమిటంటే పుష్ప ఒక్కరోజులో కలెక్ట్ చేసిన హైయెస్ట్ కలెక్షన్ మొత్తం కూడా ఇదే.  16వ రోజు ఈ రేంజ్ హైయెస్ట్ కలెక్షన్ రావడం అన్నది బహుశా ఒక రికార్డు అవుతుందేమో అని అనిపిస్తుంది. హిందీ జనాలకు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది అని చెప్పడానికి ఇది రుజువు. మొదటి నుంచి వారి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా అక్కడ ఇంత పెద్ద హిట్ కావడం పట్ల షాక్ అవుతున్నాడు. మరి భవిష్యత్తులో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: