తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు డ్యూయల్ రోల్ పాత్రల్లో కనిపించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి, అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా డ్యూయల్ రోల్ లో కనిపించి మంచి విజయాలు అందుకున్న సినిమాలు ఉన్నాయి. అలా మాస్ మహారాజా రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా విక్రమార్కుడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అనుష్క శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాపై మొదటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న విక్రమార్కుడు సినిమా 23 జూన్ 2006 న విడుదల అయింది.

సినిమా విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించాడు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ అత్తిలి సత్తిబాబు పాత్రలో దొంగ గా నవ్వులు పూయిస్తూ,  మరొక పాత్రలో విక్రమ్ సింగ్ రాథోడ్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గంభీరంగా కనిపిస్తాడు. ఈ రెండు పాత్రల్లోనూ రవితేజ తనదైన వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఇలా డ్యూయల్ రోల్ లో కనిపించిన రవితేజ ఈ సినిమాతో అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంసలను పొందాడు. ఈ సినిమాలో రవితేజ, అనుష్క శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో రవితేజ కు, విలన్ కు మధ్య వచ్చే సన్నివేశాలను కూడా రాజమౌళి చాల అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా విజయానికి కీరవాణి అందించిన సంగీతం కూడా దోహదపడింది. అలాగే ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ క్రేజ్ ను విపరీతంగా పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: