మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డిసినిమా నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 4న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ ఈ సినిమాలో సిద్ధ పాత్రలో కనిపించనున్నారు.

సినిమాలో సిద్ధ పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. ఆచార్యకి సిద్ధ పాత్ర సోల్ లాంటిదని అర్ధమవుతుంది. అయితే ఈ పాత్రకి ముందు కొరటాల శివ చరణ్ ని అనుకోలేదట. బయట హీరో అనుకున్నారట. అయితే చిరు సినిమా అది కూడా గెస్ట్ రోల్ ఛాన్స్ మంచిదే అయినా రిస్క్ ఎందుకు అనుకుని ఒకరిద్దరు హీరోలు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు టాక్. అయితే ఈ పాత్రకి ముందు మహేష్ ని అడిగారని వార్తలు వచ్చాయి. కాని కొరటాల శివ మహేష్ ని అడగలేదని క్లారిటీ ఇచ్చారు.

సిద్ధ పాత్రకి బయట హీరోలని ప్రయత్నించగా ఎవరు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కొరటాల శివ చరణ్ కి ఫోన్ చేసి ఈ పాత్ర నువ్వే చేయాలి ఇంకెవరికి ఊహించుకోలేనని చెప్పారట. కొరటాల శివ అలా చెప్పేసరికి చరణ్ కాదనలేక ఈ సినిమా చేసినట్టు తెలుస్తుంది. చరణ్ ఓ పక్క ఆచార్య చేస్తూనే ఆర్.ఆర్.ఆర్ కి టైం కేటాయించాడు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాతే ఆచార్య రిలీజ్ చేయాలని అనుకున్నారు. జనవరి 7న రిలీజ్ అవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడ్డది. మరి ఆర్.ఆర్.ఆర్ రాలేదు ఆచార్య అనుకున్న డేట్ కి వస్తుందా రాదా అన్నది చూడాలి.  సిద్ధ పాత్రకి చరణ్ ఒప్పుకున్న తర్వాత అనుకున్న దానికన్నా ఆ పాత్ర సన్నివేశాలు ఎక్కువ రాసుకున్నాడట కొరటాల శివ.

మరింత సమాచారం తెలుసుకోండి: