ఇప్పుడు తెలుగు లో వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఓటీటీ లో విడుదల అవుతూన్నాయి. కరోనా కారణంగా  అన్ని సినిమాల ను దర్షక నిర్మాతలు ఇలానే చేస్తున్నారు. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ అన్నీ కూడా ఇలానె విడుదల ఆవుతూ ఓ మాదిరిగా ఫెమస్ అవుతూన్నాయి. సత్యదేవ్‌, నిత్యా మీనన్‌, రాహుల్ రామకృష్ణ నటించిన పీరియాడికల్ మూవీ స్కైలాబ్‌. 1979లో అంతరిక్ష పరిశోధన శాల నుంచి స్కైలాబ్ భూమి మీద పడనుందనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.



కాగా, అప్పుడే తెలంగాణ లోని బండ లింగంపల్లి గ్రామం లో జరిగిన ఆసక్తికర సన్నివేశాల ఇతి వృత్తంగా కల్పిత కథ తో ఈ సినిమా తెరకెక్కింది. విశ్వక్ ఖండే రావు ఈ సినిమా కు దర్శకుడు. ఈ సినిమా నిర్మాతల్లో నిత్యా మీనన్ కూడా ఒకరు కావడం విశేషం. డిసెంబర్ 4 న విడుదలైన ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆశించిన స్థాయి లో విజయాన్ని అందుకోలేక పోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో అలరించేందుకు సిద్ధమైంది.



సత్యదేవ్‌, నిత్యా మీనన్ నటించిన స్కైలాబ్ సినిమా సంక్రాంతి కానుక గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో విడుదల అవుతుంది. జనవరి 14 నుంచి సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగ ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ లు సినిమా పై అంచనాల ను పెంచుతున్నాయి..  మరి ఇప్పుడు ఎలా వుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.. వరుస సినిమాలు ఇప్పుడు ఇలానే విడుదల అవుతూన్నాయి.. ఇప్పుడు కరొన మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యం లో సినిమాలు విడుదల అయ్యేలా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: