మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా పోస్ట్ పోన్ కావడం పట్ల కొంత నిరాశ లో ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఆయన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తూ ఉండటం దీని పైన ఆయన పాన్ ఇండియా మార్కెట్ ఆధారపడి ఉండడంతో రామ్ చరణ్ ఈ సినిమాను అనుకున్న సమాయానికి విడుదల చేసి భారీ క్రేజ్ ను సొంతం చేసుకొని పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంత గ్రాండ్ గా అడుగుపెట్టాలని చూసాడు. ఆ విధంగా చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకోగా కరోనా ఒక్కసారిగా ఆయన ఆశలను అడియాశలు చేస్తూ ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యే విధంగా చేసింది.

దాంతో రామ్ చరణ్ మరి కొన్ని రోజులు తన పాన్ ఇండియా ఎంట్రీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఆయన మరొక సినిమా అయిన శంకర్ చిత్రం షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. శంకర్ లాంటి భారీ క్రేజ్ ఉన్న దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. తెలుగులో ఆయన తొలిసారి చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి తప్పకుండా ఈ సినిమాను వేరే లెవెల్ చిత్రంగా తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నాడు. అయితే ఆయన ఇపుడున్న పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమాను ఎంతవరకు బాగా చేస్తాడు అనేదే అసలు విషయం.

మరోవైపు చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా లాక్ అయిన్నట్లుగా తెలుస్తుంది. తొందర్లోనే ఈ సినిమాను మొదలు పెట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకోవాలన్న ది రామ్ చరణ్ ఆలోచన. అయితే ఎప్పుడూ లేని కసి రామ్ చరణ్ లో ఇప్పుడు కనబడుతుంది అని ఆ సినిమాకు పని చేసిన కొంతమంది చెబుతున్నారు. పాన్ ఇండియా హీరో గా ఎదగాలనే ఆశతో కసితో ఆయన ఈ విధంగా పని చేస్తున్నారని వారు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: