ఓ పక్క పుష్ప ఆశించిన దానికన్నా సక్సెస్ అందుకోవడంతో పాన్ ఇండియా లెవల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ మీద తను పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పుష్ప రాజ్ గా తనని నేషనల్ స్టార్ గా ఎదిగేలా చేశాడు. పుష్ప సినిమా అల్లు అర్జున్ స్థాయిని పెంచిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఫ్యామిలీతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లాడు. కేవలం అల్లు అర్జున్ ఫ్యామిలీ మాత్రమే కాదు అతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా గోవాకి షిఫ్ట్ అయ్యింది. 5 రోజుల పాటు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ మెంట్ అని తెలుస్తుంది.

ఫ్యామిలీ ఎంజాయ్ మెంట్ తో అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు గోవా లో ఎంటర్టైన్ అవుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తానెంత స్టార్ హీరో అయినా సరే ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వడంలో అల్లు అర్జున్ కూడా ముందుంటాడు. సినిమాలతో బిజీగా ఉన్న టైం లో ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉంటాడో.. సినిమా సినిమాకు గ్యాప్ టైం లో అదే ఫ్యామిలీతో పూర్తి టైం స్పెండ్ చేస్తాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ  గోవా ట్రిప్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇక బన్నీ సినిమాల స్టేటస్ విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్టే. ఇక త్వరలో పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ కి రెడీ కానున్నారు. ఈ సినిమా అంచనాలను మించి ప్లాన్ చేస్తున్నారట డైరక్టర్ సుక్కు. త్వరలోనే పుష్ప పార్ట్ 2కి సంబందించిన క్రేజీ అప్డేట్ వస్తుందని చెబుతున్నారు. పుష్ప పార్ట్ 2 కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను మించేలా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప రాజ్, భనవర్ సింగ్ శిఖావత్ ల మధ్య యుద్ధం పార్ట్ 2ని నెక్స్ట్ లెవల్ లో తీసుకెళ్తుందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: