మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే  ఎందుకంటే 'వినయ విధేయ రామ' సినిమా తర్వాత చరణ్ నుంచి మరో సినిమా విడుదల కాలేదు. దానికి తోడు ఈ సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది. ఇక రామ్ చరణ్ కూడా రాజమౌళి దర్శకత్వంలో 'త్రిబుల్ ఆర్' సినిమాతో ఫుల్ బిజీ అయిపోయాడు. సంక్రాంతి కానుకగా జనవరి 7న త్రిబుల్ ఆర్ విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది దాంతో ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఎవరూ ఊహించని విధంగా రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు కేవలం నెల రోజుల గ్యాప్ లోనే థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.

ఇప్పటికే కర్రోనా వల్ల సినిమాల రిలీజ్ డేట్స్ తారుమారు అయిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ సినిమాల విషయంలో మాత్రం కరోనా ఫాన్స్ కి కాస్త మేలు చేసిందని చెప్పాలి. తాజాగా ప్రకటించిన విడుదల తేదీల ప్రకారం చూసుకుంటే.. నెల రోజుల వ్యవధిలో చరణ్ నుంచి రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అవే త్రిబుల్ ఆర్, ఆచార్య సినిమాలు. త్రిబుల్ ఆర్ సినిమాకు సంబంధించి మేకర్ ఇప్పటికే 2 రిలీజ్ డేట్స్ ఇచ్చారు. కుదిరితే మార్చి 18 లేకుంటే ఏప్రిల్ 28 న థియేటర్లో సినిమా తీసుకొస్తామని ప్రకటించారు. అటు ఆచార్య విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు.

నిజానికి ఫిబ్రవరి 4న రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి ఏప్రిల్ 1వ తేదీన థియేటర్స్ లోకి వస్తున్నట్లు తెలియజేశారు. అంటే ఎలా చూసుకున్నా కూడా రామ్ చరణ్ నుంచి నెల రోజుల గ్యాప్లో రెండు సినిమాలు వస్తున్నాయన్నమాట. ఒకవేళ త్రిబుల్ ఆర్ మార్చి 18 కే వస్తుంది అని అనుకుంటే అక్కడికి రెండు వారాల గ్యాప్ లో ఆచార్య రిలీజ్ కానుంది. పోనీ త్రిబుల్ ఆర్ ఏప్రిల్ 28న వస్తుందనుకుంటే అప్పటికి ఆచార్య విడుదల 27 రోజులు అవుతుంది. కాబట్టి ఎటు చూసుకున్న ఒకే నెలలో రెండు సినిమాలు థియేటర్ లోకి రావడం పక్క అని చెప్పొచ్చు.ఇంకేముంది ఈ రెండు సినిమాలతో ఫాన్స్ పండగ చేసుకోవడం ఖాయం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: