దక్షిణాది అగ్ర కథానాయకుల లో ఒకరైన సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను సెట్ చేసుకొని మునుపటిలా బిజీ అవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆమె హీరోయిన్ గా 2 సంవత్సరాల క్రితం జాను అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా అప్పటి నుంచి పూర్తిస్థాయి తెలుగు సినిమా ఇప్పటివరకు చేయలేదు అంటే ఆమె ఏ స్థాయిలో వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందరినీ ఎంతగానో ఉర్రూతలూగించిన ఈమె బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా నటించి పాపులారిటీ పరంగా భారీగా తన స్థాయి పెంచుకుంది.

ఈ రెండిటి పరంగా కూడా ఆమెకు నేషనల్ వైడ్ గా పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ తో ఆమె పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి మేకర్స్ అవకాశాలు ఇస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక సినిమాలో చేసిన సమంత త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం కంటే ముందే ఆమె డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ను పలకరించపోతుంది. విజయ్ సేతుపతి మరియు నయనతారతో కలిసి నటించిన ఓ తమిళ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో సమంత క్రేజ్ ఆధారంగానే విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా ఈ సినిమాకు ఇక్కడ క్రేజ్ లేకపోవడం సమంత అభిమానులను నిరాశ పరుస్తుంది. తెలుగు ట్రైలర్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు అని అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఒక సినిమా ఉందని కూడా చాలామంది తెలియలేదు. ఈ నేపథ్యంలో సమంత ఏ విధంగా ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం యశోద అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమంత త్వరలోనే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: