మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  తమన్నా 'హ్యాపీ డేస్'  సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది.  ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాలను సాధించడంతో తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో కాలం పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది,  ఇది ఇలా ఉంటే తమన్నా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అనేక సినిమాలలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే తమన్నా బాలీవుడ్ సినిమాల ద్వారా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది,  సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న తమన్నా చాలా కాలం నుండి సినిమాలలో హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్ లకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తమన్నా ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్ లలో నటించి ప్రేక్షకులను అలరించింది.

 తమన్నా , బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన అల్లుడు శీను సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేసింది.

 ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన స్పీడున్నోడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది.

 అలాగే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవకుశ మూవీ లో స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా  తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును వేడెక్కించింది.

 అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా పాన్ ఇండియా మూవీ అయిన  కే జి ఎఫ్ చాప్టర్ వన్ లో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను మైమరపించింది.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న గని సినిమాలో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది.

 ఇలా హీరోయిన్ గా టాప్  పొజిషన్ ఉన్న సమయం నుండి ఇప్పటి వరకు తమన్నా ఎప్పటికప్పుడు స్పెషల్ సాంగ్ లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: