తాజాగా విడుదలైన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'  సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఇకపోతే ఇటీవల ఈ సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి, అభిమానులకు, భారతీయ సినిమా ప్రేక్షకులకు ఎన్టీఆర్ థాంక్స్ చెబుతూ ఒక నోట్ విడుదల చేశారు.ఇక అసలు విషయం లోకి వెళితే ఎన్టీఆర్ మాట్లాడుతూ  "నా బెస్ట్ ఇచ్చేలా నన్ను ఇన్‌స్ఫైర్‌ చేసిన జక్కన్న కు చాలా థాంక్స్. ఆయన నాలో బెస్ట్ బయటకు తీసుకొచ్చారు. అంతేకాదు దానితో పాటుగా ఆయన నేను వాటర్ అని ఫీలయ్యేలా చేశారు. ఆయన నన్ను పాత్రలో లీనమయ్యేలా  పుష్ చేశారు. ఇదిలా ఉండగా ఆయన మాట్లాడుతూ ...

సినిమాలో నా బ్రదర్ రామ్ చరణ్ లేకుండా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఊహించుకోలేను. ఇకపోతే అల్లూరి సీతారామరాజు పాత్రకు చరణ్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు.అయితే  'ఆర్ఆర్ఆర్' సినిమాయే కాదు, భీమ్ పాత్ర కూడా చరణ్ లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. ఇక లెజెండరీ హీరో అజయ్ దేవగణ్ గారితో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ సినిమాలో ఆలియా భట్ పవర్ హౌస్. ఆమె తన పాత్రతో సినిమాకు బలం చేకూర్చింది. ఇకపోతే సినిమాలో ఒలీవియా, అలీసన్ డూడీ,రే స్టీవెన్ సన్ తమ నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాదు ఇండియన్ సినిమాకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను" అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

దీనితో పాటుగా  చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య తమకు బలం అని ఎన్టీఆర్ తెలిపారు.ఇకపోతే 'ఆర్ఆర్ఆర్' అనే కలను నిజం చేసిన దానయ్యకు ఆయన థాంక్స్ చెప్పారు. కాగా కీరవాణి సంగీతం సినిమాకు ప్రాణం పోసిందన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఎస్.ఎస్. కార్తికేయ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తదితరులకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు ఎన్టీఆర్.అంతేకాదు దాని అనంతరం అభిమానులకు కూడా ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. ఇకపోతే మరిన్ని సినిమాలతో వాళ్ళను ఎంటర్టైన్ చేస్తానని చెప్పారు.అయితే  అభిమానులు చూపించే ఎటువంటి పరిమితులు లేని ప్రేమ, మద్దతు కరోనా సమయంలోనూ తాను బెస్ట్ ఇచ్చేలా దోహదం చేసిందని ఎన్టీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: