సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. మార్వెల్ సినిమా యూనివర్స్ లో భాగంగా రూపొందించిన ఈ సినిమాలు ఇండియాలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లను రాబడుతూ ఉన్నాయి. ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉన్న మార్వెల్ సూపర్ హీరో క్యారెక్టర్లలో థోర్ కూడా ఒకటి. ఇది నాలుగోవ సినిమా. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది జూలై 8వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో థోర్ గా క్రిస్ హెమ్స్ వర్త్ నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను టీజర్ను విడుదల చేయగా మంచి స్పందన లభించింది.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.. మొదటగా పిల్లకాయలు ఇప్పుడు మీరు పాప్ కార్న్ తింటూ కూర్చోండి అనే మాట నుండి ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది.. ఇందులో
 థోర్ కి తోడుగా ఆమె ప్రేయసి"జెన్ పోస్టర్" కూడా నటిస్తోంది. ఈమె కూడా లేడీ థోర్ గా అలరిస్తోంది. కింగ్ వాల్తేర్ కోర్టుకు మరియు మాజీ ప్రియురాలు  లేడీ థోర్  సహాయంతో తన ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడుతాడు అనే విషయం కథాంశంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.

ఎప్పటిలాగానే ఇందులో థోర్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా అవసరమైన వీరోచిత పోరాటాలు చేసే విధంగా పాత్రను డిజైన్ చేయడం జరిగింది. ఇక ట్రైలర్ చివరిలో నీ ముసుగు తొలగిస్తాను అంటూ థోర్ ను నగ్నంగా నిలబెట్టే సన్నివేశాలు బాగా కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు చేస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వం వహించారు ఆయన ఇంతకుముందే ఇదే సిరీస్లో..థోర్ రాగ్నారొక్ అనే సినిమాను కూడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం ట్రైలర్ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: