ఒక కథ కు ఒక హీరోను అనుకుని , ఆ హీరోకు కథను వినిపించగా , ఆ సమయంలో ఆ హీరోకు ఆ కథ నచ్చకపోవడం లేక డేట్స్ ను సర్దుబాటు చేయలేక పోవడం , మరొ కొన్ని ఇతర కారణాల వలన కొంత మంది హీరో లు వదులుకున్న కథలు వేరే హీరోతో తెరకెక్కేబడి సూపర్ హిట్ విజయాలను అందుకున్న సందర్భాలు అనేకం సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నాడు . అలా వదులుకున్న మూవీ లలో కొన్ని సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి . అలా జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాల గురించి తెలుసుకుందాం .

సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా కథ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకే వచ్చిందట , కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ని జూనియర్ ఎన్టీఆర్ రిజల్ట్ చేసినట్లు తెలుస్తుంది. నితిన్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ సినిమా కథ  మొదటగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకే వచ్చిందట,  కాకపోతే కొన్ని కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించే లేక పోయినట్లు తెలుస్తోంది.  దిల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిక్ మూవీ కథ మొదటగా ఎన్టీఆర్ వద్దకే వచ్చిందట,  కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించలేకపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: