బాలీవుడ్‌ ఇండస్ట్రీకి వరుసగా షాక్స్ మీద షాక్స్ తగులుతూనే ఉన్నాయి. అక్కడి హీరోలు వరుస పెట్టి సినిమాలను ప్లాప్ చేస్తూ ఉత్తరాది ఆడియెన్స్ కు బాగా షాక్స్ ఇస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలు సరేసరి కనీసం స్టార్ హీరోలైనా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తారు అంటే ఆమిర్ ఖాన్ లాంటి హీరో కూడా ఈ విషయంలో చేతులెత్తేసాడు.ఇక మొత్తంగా నార్త్ సైడ్ ఫిల్మ్ బిజినెస్ ఇప్పట్లో గాడిన పడే అవకాశాలే అసలు కనిపించడం లేదు.గత కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసిస్తున్న హీరోలు ఆమిర్ ఖాన్ ఇంకా అక్షయ్ కుమార్. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కావడంతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 11 వ తేదీన ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' గా వస్తే, అక్షయ్ ఏమో 'రక్షా బంధన్' అంటూ సెంటిమెంట్ మూవీ ని తీసుకొచ్చాడు. ఇద్దరు స్టార్ హీరో పూర్తిగా పడిపోయిన బాలీవుడ్ బిజినెస్ ను నిలబెడతారని అందరూ కూడా అనుకున్నారు. కానీ వీరిద్దరు తీసుకొచ్చిన సినిమాలు ఉత్తరాది వారికి అయితే అస్సలు నచ్చలేదు. దాంతో తొలి రోజు వసూళ్లు ఈ సినిమాలకు దారుణంగా వచ్చాయి.


ఇక ఈ క్రూయల్ సిచ్యూవేషన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకునేది ఎవరూ అనేది ఇప్పుడు నార్త్ ఇండియానే కాక సౌత్ ఇండియా అంతటా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక టాలీవుడ్ నుంచి వెళ్తున్న మరో పాన్‌ ఇండియా ఫిల్మ్ 'లైగర్' తప్పకుండా హిందీ మార్కెట్ కు కొంత లైఫ్ ఇస్తుందని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. కరణ్ జోహర్ లాంటి పెద్ద బాలీవుడ్ నిర్మాత బ్యానర్ నుంచి  ఈ మూవీ రిలీజ్ అవుతుండం ఇంకా అలాగే విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కు జనం ఎగబడుతుండటం చూస్తుంటే లైగర్ సినిమా ఓపెనింగ్స్ వేరే లెవల్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే లాల్ సింగ్ చడ్డా, ఇంకా రక్షా బంధన్ సినిమాలు చాలా తీవ్రంగా నిరాశపరిచినా కూడా లైగర్ వస్తున్నాడు కదా అనే కాన్ఫిడెన్స్ బీటౌన్ ఎగ్జిబీటర్స్ లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.మరి లైగర్ బాలీవుడ్ ని కాపాడుతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: