రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మకమైన సినిమా త్రిబుల్ ఆర్. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికే నెలలు గడిచి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే.  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలు అందరికీ కూడా లాభాల పంట పండించింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కూడా నటనలో ఎక్కడ ఎవరు ఎవరికి తక్కువ కాదు అన్న రీతిలో నటనతో ప్రేక్షకులను మెప్పించారు అని చెప్పాలి.


 అయితే ఈ సినిమా విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా ఈ సినిమాలోని ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పాలి. అయితే త్రిబుల్ ఆర్ సినిమా లో బాగా పాపులారిటీ సంపాదించిన పాట ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పేది కొమురం భీమూడో సాంగ్. ఈ సాంగ్లో ఒకవైపు ఎన్టీఆర్ మరో వైపు రామ్ చరణ్ తన నటన తో పోటీపడి ప్రేక్షకులందరిని కూడా ఆశ్చర్యపరిచారు. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్స్ లో ఈ పాట అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.


 అయితే సాధారణంగా ఏదైనా తెరకెక్కించాలని అంటే దానికి ఏదో ఒక విషయం నుంచి స్ఫూర్తి పొందాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి కొమరం భీముడు పాట రూపొందించడానికి బ్రేవ్ హార్ట్ సినిమా నుంచి స్ఫూర్తి పొందారట. మెల్ గిబ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ బ్రేవ్ హార్ట్ 1995లో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే బ్రేవ్ హార్ట్ మూవీ క్లైమాక్స్ చూసి రామ్ తన మిత్రుడు భీమ్ ను బ్రిటిష్ దొరల ఆదేశాల మేరకు శిక్షించేలా ఆలోచన చేశాను. ఇక అప్పుడే కొమరం భీముడు సాంగ్ ఆలోచన వచ్చింది అంటూ రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: