దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు శంకర్ ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించాడు. అలాగే శంకర్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించాయి. ఇది ఇలా ఉంటే ఆఖరు గా శంకర్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన రోబో 2.0 మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన రోబో 2.0  మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది.

ఇది ఇలా ఉంటే రోబో 2.0 మూవీ తర్వాత శంకర్ ,  కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టాడు. కొత్త భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచి పోయింది. దానితో శంకర్ , రామ్ చరణ్ హీరోగా మరో మూవీ ని మొదలు పెట్టాడు. కొంత కాలం క్రితమే ఇండియన్ 2 మూవీ ని కూడా శంకర్ తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతం ఇటు ఇండియన్ 2 మూవీ ని మరియు రామ్ చరణ్ మూవీ లకు శంకర్ దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ ల తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతుంది. దర్శకుడు శంకర్ ,  లోక నాయకుడు కమల్ హాసన్ తో తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న మూవీ లు సినిమా పూర్తి కాగానే కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య తో ఒక మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: