మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో అత్యంత ప్రజాదరణ కలిగి ఉంది. ఈ షో గత ఐదు సీజన్స్ గా తిరుగు లేకుండా దూసుకుపోతుంది.ఇక  ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు అనేక రికార్డ్స్ నమోదు చేసింది. కాగా నాని, నాగార్జునల సారథ్యంలో మరిన్ని హైట్స్ అందుకుంది. అయితే అత్యధికంగా బిగ్ బాస్ తెలుగు 4 లాంచింగ్ ఎపిసోడ్ 18.8 టీఆర్పీ రాబట్టింది.ఇదిలావుంటే లేటెస్ట్ సీజన్ దారుణమైన కష్టాలు ఎదుర్కొంటుంది.ఇక  వీక్ డేస్, వీకెండ్ అనే తేడా లేకుండా పూర్ షో కొనసాగుతుంది.అయితే  బిగ్ బాస్ షో ఎపిసోడ్స్ కి కేవలం 2 నుండి 2.5 రేటింగ్ మాత్రమే వస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే  నాగార్జున వచ్చే వీకెండ్స్ లో 3-3.5 రేటింగ్ రాబడుతుందట.అయితే  ప్రైమ్ టైంలో ఓ పాప్యులర్ షోకి ఈ రేటింగ్ అంటే చాలా తక్కువని అర్థం.ఇక.బిగ్ బాస్ షోతో పోల్చితే సీరియల్స్ మంచి టీఆర్పీ అందుకుంటున్నాయి. అయితే సీరియల్స్ 10 టీఆర్పీ వరకు రాబడుతుంటే బిగ్ బాస్ 6 వీకెండ్ ఎపిసోడ్స్ కూడా 4 టీఆర్పీ దాటలేకపోవడం ఊహించని పరిణామం.ఇక ప్రస్తుత సీజన్ నిర్వాహకులకు భారీ షాక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో టీఆర్పీ పెంచాలని అనేక ఆలోచనలు చేస్తున్నారు. ఇక అసలు ముక్కూ ముఖం తెలియని కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇంత తక్కువ రేటింగ్ రాలేదు.

అంతేకాదు హోస్ట్ నాగార్జునలో కూడా ఫైర్ తగ్గింది. ఆయన గత సీజన్స్ మాదిరి అలరించలేకపోతున్నారు. అయితే టీఆర్పీ ఒత్తిడిలో పడి కంటెస్టెంట్స్ ని విమర్శించడం, తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక మునుపటిలా కంటెస్టెంట్స్ లో జోష్ ఆయన నింపలేకపోతున్నారు.అయితే  గతంలో ఎలిమినేషన్స్ ఉన్నప్పటికీ వీకెండ్ షోస్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగేవి.... కంటెస్టెంట్స్ ఆట పాటలతో మంచిగా అలరించేవారు.ఇకపోతే బిగ్ బాస్ 6 మొదలై మూడు వారాలు గడుస్తున్నా మెరుగయ్యే దాఖలాలు కనిపించడం లేదు.  ట్రెండ్ కొనసాగితే నెక్స్ట్ సీజన్ కష్టమే అంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఉండకపోవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే  మెరుగైన హోస్ట్ దొరికితే, కంటెస్టెంట్స్ ఎంపికైతే నెక్స్ట్ సీజన్ ఉండవచ్చు. ...లేదంటే స్టార్ మా బిగ్ బాస్ షోకి తెరదించడం ఖాయం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: