సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని చాలామంది హీరోలు భావిస్తున్నారు. దా నికి కారణం ఆయన ఇటీవల దర్శకత్వం వహించిన పుష్ప చిత్రం సంచలన విజయాన్ని అందుకోవడమే. పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమాను హిట్ చేయడం అంటే మామూ లు విషయం కాదు. ఎంతో కలిసి వస్తే కానీ ఆ సదరు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోదు. ఆ విధంగా ప్రతికూల పరిస్థితులలో కూడా సుకుమార్ పుష్ప సి నిమాను విడుదల చేసినా పాన్ ఇండియా వైడ్ గా ఆ చిత్రంతో సంచలనాన్ని నమోదు చేసుకున్నాడు.

అలా వందల కోట్ల కలెక్షన్లను తీసుకువచ్చిన ఈ సినిమా ఇప్పుడు రెండవ భాగానికి రెడీ అ వుతుంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం పూర్తవబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగు తుంది. చాలా రోజుల నుంచి సుకుమార్ తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఈ నేపథ్యంలో సుకుమార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. దానికి కారణం గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ కూడా సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలను సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దాంతో సుకుమార్ త్వరగా దీనిపట్ల ఓ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అయితే సుకుమార్ చేయబోయే తదుపరి సినిమా పట్ల ఇప్పటికే చాలాసార్లు అయోమయానికి ప్రేక్షకులు గురయ్యారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఆయన అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ తొందరగా ఈ విషయమై ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే మంచిది అని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: