కరోనా పరిస్థితులలో వచ్చిన దసరా సీజన్ లో అమ్మకాలు ఎలా ఉంటాయి అని భయపడ్డ అనేక కంపెనీలకు అనేక ప్రముఖ ఈ కామర్స్ కంపెనీల పండగ సేల్స్ ఆఫర్స్ ఊహించని జోష్ ను ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్ సీర్ అంచనా ప్రకారం దసరా సీజన్ ఇంకా పూర్తి కాకుండానే దేశ వ్యాప్తంగా 22 వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.


సాధారణంగా ఈ కామర్స్ కంపెనీలు దసరా దీపావళి పండగల సీజన్ లో మూడు రౌండ్ల సెల్ ను ప్రకటిస్తాయి. మొదటి రౌండ్ లో అమ్మకాలు 400 కోట్ల డాలర్ల స్థాయిలో నమోదుకావచ్చని రెడ్ సీర్ సంస్థ అంచనాలు వేస్తే వాస్తవ విక్రయాలు దానికన్నా ఎక్కువగా ఉండి కేవలం ఈ దసరా సీజన్ లోనే 700 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండేలా అనిపిస్తోందని ఒక అంచనా వస్తోంది.


ఇప్పుడే ఇలా ఉంటే దీపావళి సీజన్ వచ్చే సరికి ఈ అమ్మకాలు మరింత పెరిగి 22వేల కోట్ల స్థాయికి పెరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలా ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరగడానికి ఈ కామర్స్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో పాటు రకరకాల వెరైటీ వస్తువులు విభిన్న డిజైన్స్ లో ఈ కామర్స్ పోర్టల్స్ లో కనిపించడం.


పండుగ సీజన్ లో ఈ కామర్స్ దిగ్గజాలు అయిన అమెజాన్ ఫ్లిప్ కార్ట్ కంపెనీల ద్వారా 1.5 కోట్ల స్మార్ట్ ఫాన్స్ విక్రయం జరిగే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ కు వస్తున్న 10 ఆర్డర్స్ లో ఎక్కువ శాతం ఆర్డర్లు చిన్న నగరాలు చిన్న పట్టణాలు నుంచి వస్తూ ఉండటంతో ఈకామర్స్ కంపెనీల హవా దేశం యావత్తూ ఎలా వ్యాపించిందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఈకామర్స్ కంపెనీల హవా తో చిన్నతరహా మధ్య తరహా వ్యాపారాలు అన్నీ అటకెక్కే పరిస్థితులలో ఉన్నాయని అంచనాలు వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: