ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారం చేయడమే మేలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగంలో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. కానీ వ్యాపారంలో సొంత వ్యాపారం కాబట్టి ఆచుతూచి ముందడుగు వేయవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే నెలవారి ఆదాయం పొందాలనుకుంటే మీకోసం ఒక చక్కటి బిజినెస్ తీసుకురావడం జరిగింది. అదే ఆకుల బిజినెస్. ఈ ఆకులు పూజలు, శుభకార్యాలలో చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. మరికొన్నింటిని ఆహారంలో కూడా వినియోగిస్తారు. వాటిలో అరటి, తమలపాకు ప్రధానమైనవి. ఈ రెండే కాకుండా సాఖూ ఆకు కూడా ఉంది. దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కూడా ఉండడం గమనార్హం.


దక్షిణ భారతదేశంలో అరటి ఆకులకు ఎంత డిమాండ్ ఉందో ఉత్తర , తూర్పు భారతదేశంలో తమలపాకులకు మంచి గిరాకీ ఉంది. మరొకవైపు కొండ ప్రాంతాలలో అరటి ఆకుల మాదిరిగానే సాఖూ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు.  ఈ మూడు రకాల ఆకులను పండించడం ద్వారా రైతులు మరిన్ని లాభాలను పొందవచ్చు. ఈ మూడు ఆకులతో మీరు బిజినెస్ చేపట్టినట్లయితే మంచి ఆదాయం వస్తుంది. తమలపాకులను మనదేశంలో ప్రతి చోట ఉపయోగిస్తారు. కాబట్టి వీటికి డిమాండు పూర్తిస్థాయిలో ఉంది.  దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు.


ముఖ్యంగా పూజలు , శుభకార్యాల్లో తమలపాకుల వినియోగం ఎక్కువగా ఉంటుంది.  అన్నిటికి మించి పాన్ షాప్ లో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే వీటిని ఒక తోటలాగా విస్తరింప చేస్తే ఖచ్చితంగా రైతుల తలరాత మారిపోయినట్లే అని చెప్పవచ్చు. అరటి ఆకుల లాగే ఉండే ఈ ఆకులను  వివాహాల్లో ఆహారం వడ్డించడానికి ఉపయోగిస్తారు. వీటి  కలప కూడా చాలా ఖరీదైనది. ఒకవేళ మీరు ఈ మొక్కలను సాగు చేస్తే అటు కలప నుంచి ఇటు ఆకుల నుంచి రెండు ఆదాయ వనరులను మీరు పొందవచ్చు. ఈ పంటలు రైతులను ధనవంతులను చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: