నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ నుండి తేరుకుని కొద్దిపాటి గ్యాప్ తో చేసిన సినిమా రూలర్. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో ఈ సినిమా  తెరకెక్కింది. ఈ ఇద్దరి ఇదివరకు జై సింహాకు కలిసి పనిచేశారు. సి కళ్యాన్ నిర్మించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

 

సినిమా టైటిల్ కు రూలర్ అని పెట్టడం నందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. అదెలా అంటే ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన దమ్ము సినిమాలో రూలర్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అయితే అదే టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ అనుకున్నారు. కాని టైటిల్ బాలకృష్ణ తీసుకోవడం జరిగింది.

 

ఎలాగు బాబాయ్ అడిగితే అబ్బాయ్ కాదనే ప్రసక్తి లేదు ముందు రూలర్ టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా చేయాలని అనుకున్నా సరైన కథ దొరకలేదని తెలుస్తుంది. అందుకే రూలర్ టైటిల్ మీద ఆశలు వదులుకున్నాడు తారక్. ఇక ఆ టైటిల్ మీద మనసు పడ్డ బాలయ్య బాబు కె.ఎస్ రవికుమార్ మూవీకి అది పెట్టాడు. 

 

కె.ఎస్ రవికుమార్ కథకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని భావించిన బాలకృష్ణ అబ్బాయ్ టైటిల్ అని తెలిసినా తన సినిమాకు రూలర్ అని ఫైనల్ చేశాడు. ఎన్టీఆర్ కూడా బాబాయ్ బాలకృష్ణ తన టైటిల్ వాడుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడట. మొత్తానికి బాలకృష్ణ రూలర్ మరి నిజంగానే రికార్డులను రూల్ చేసేలా ఉంటుందా లేదా అన్నది చూడాలి. డిసెంబర్ 20న బాలయ్య రూలర్ తో పాటుగా మెగా హీరో సాయి తేజ్ ప్రతిరోజూ పండుగే సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. మారుతి డైరక్షన్ లో వస్తున్న సాయి తేజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: