సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్లాస్ చిత్రల దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్లు సాంగ్స్ సినిమా మీద ఓ మాదిరి అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా కంటెంట్ అర్జున్ రెడ్డి తరహాలోనే ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఇప్పటికే విజయ్ సినిమా అంటేనే అడల్ట్ కంటెంట్‌ను అన్న అపవాదు వచ్చేసింది. అర్జున్ రెడ్డి సినిమాలో లాంటి రొమాంటిక్ సీన్స్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకే విజయ్ దేవరకొండ కూడా తన ప్రతీసినిమాలో అలాంటి సీన్స్ ఉండేలా చూసుకుంటున్నట్టు ఉన్నాడు.
తాజాగా రౌడీ స్టార్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా అలాంటి సీన్స్ కావాల్సినన్ని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఈ సినిమా సెన్సార్ కానుంది. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ కన్ఫార్మ్ అనిపిస్తోంది.
సెన్సార్ బోర్డు కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కు ఎ ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే ఏ సర్టిఫికేట్ సినిమాలో కూడా ఉండకూడని కొన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయట. ఆ సీన్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో కత్తెర వేయాల్సిందే అని కండిషన్ పెట్టిందట సెన్సార్ బోర్డ్. దీంతో సినిమాను రీ ఎడిట్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్ర నిర్మాతలు. నలుగురు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాలో ఘాటు రోమాన్స్ సీన్స్ చాలానే ఉన్నాయట.
సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే యూత్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఎగ్జామ్స్ సీజన్ కావటంతో యూత్ ఎంతవరకు థియేటర్లకు వస్తారా అన్న అనుమానాలుకలుగుతున్నాయి. రౌడీ గతచిత్రాలు ఫెయిల్యూర్స్ కావటంతో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.