సినిమా ప్రమోషన్ కోసం సినిమా కార్యక్రమా ల్లో కొందరు నటీ నటులు చేసే కామెంట్స్ కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. కొంత మంది సినిమా చూడాలనే ఆత్రంలో భాగంగా కొన్ని అర్ధం కాని మాటలు కూడా మాటాడుతూ ఉంటారు. ప్రస్తుతం నితిన్, రష్మిక అలాగే మాట్లాడుతున్నారంటున్నారు సోషల్ మీడియా జనాలు. ప్రస్తుతం వీళ్ళు ఇద్దరు కలిసి ఒక సినిమా చేసారు. భీష్మ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసింది చిత్ర యూనిట్. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యాడు. 

 

ఇక ఈ సినిమా కార్యక్రమంలో నితిన్ కాస్త ఆసక్తికర ప్రసంగం చేసాడు. ఏడాదిన్నర విరామం తర్వాత తాను చేసిన సినిమా భీష్మ అని... ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ‘దిల్‌’ సినిమాలకు, తనకు అభిమాని అన్నాడు. అంతే అభిమానంతో ఈ సినిమా చేశాడన్నాడు.  తన అభిమానులు ఎప్పట్నుంచో డ్యాన్స్‌ అడుగుతున్నారని... ఈ సినిమాలోని పాటతో అభిమానుల ఆకలి తీరుతుందని నమ్ముతున్నా అంటూ వ్యాఖ్యానించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది గాని ఇక్కడే కొన్ని కామెంట్స్ చేసాడు ఈ హీరో.

 

హీరోయిన్ గురించి మాట్లాడుతూ... రష్మిక బాగా నటించిందన్నాడు. రష్మిక నాకు మంచి స్నేహితురాలు అని, తనని నేను భరిస్తా, తను నన్ను భరించాలన్న నితిన్, మా ఇద్దరినీ నాకు కాబోయే భార్య భరించాలని మాట్లాడాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. నితిన్ చేసిన వ్యాఖ్యలు పెళ్లి కాక ముందే కొంపలో కుంపటి పెడతాయని, ఏ భార్య కూడా ఇంకో అమ్మాయిని తన భర్తతో భరించలేదు అని, నితిన్ కి ఆ మాత్రం తెలియదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నాడు. ఇక ఆరో ప్రాణం తన భార్య అని కూడా చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: