సినీ రంగంల వారసత్వం అనేది చాలా కామన్‌. హీరోల వారసుల నుంచి దర్శకులు, నిర్మాతలతో పాటు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌లు కమెడియన్లు కూడా తమ వారసులను హీరోలుగా వెండితెరకు పరిచయం చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. టాలీవుడ్‌ స్టార్ కమెడియన్లతో పాటు చిన్న చిన్న పాత్రలో కనిపించిన నటీనటులు కూడా తమ వారసులను వెండితెరకు పరిచయం చేశారు. అయితే కమెడియన్ల వారసులుగా వెండితెరకు పరిచయం అయిన హీరోలు సక్సెస్‌ అయిన దాఖలాలు మాత్రం లేవు.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు బ్రహ్మానందం. వెండితెర మీద హీరోలకు సమానంగా స్టార్ ఇమేజ్‌ అందుకున్న బ్రహ్మానందం తన వారసుడిని హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌. అయితే ఈ యువ నటుడు తొలి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యాడు. తరువాత బసంతి సినిమాతో రెండో ప్రయత్నం చేసినా అది కూడా ఆకట్టుకోకపోవటంతో పూర్తి సినిమాలకు దూరమయ్యాడు గౌతమ్.

 

మరో స్టార్ కమెడియన్‌ ఎంఎస్‌ నారాయణ కూడా తన కొడుకును హీరోగా పరిచయం చేశాడు. ఇతర దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. తానే స్వయంగా దర్శకుడిగా మారి కొడుకు పేరుతో సినిమాను తెరకెక్కించి విక్రమ్‌ ను హీరోగా పరిచయం చేశాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావటంతో విక్రమ్‌ కెరీర్‌కు తొలి సినిమాతోనే బ్రేక్‌ పడింది. అయితే విక్రమ్‌ మాత్రం తరువాత కూడా నటుడిగానే కొనసాగుతున్నాడు. మరో స్టార్ కమెడియన్‌ తనికెళ్ల భరణి కొడుకు కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. భరణికి ఇష్టం లేకపోయినా తన సొంత నిర్ణయంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. లవగం సినిమాతో హీరోగా పరిచయం అయిన తనికెళ్ల భరణి తనయుడు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: