టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే... జగపతి బాబు. ఒకప్పుడు హీరోగా ఎన్నో మంచి సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు విలన్ గా ఎన్నో సినిమాలు చేస్తున్నారు. జగపతి లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా అడుగు పెట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ద్వారా అతను తనలో ఉన్న కొత్త కోణం ప్రేక్షకులకు మరిచయం చేసారు. టాలీవుడ్ లో ఆ సినిమా ఎన్నో రికార్డులు నమోదు చేసింది. జగపతి బాబు కెరీర్ ని కూడా ఆ సినిమా మార్చింది అనే చెప్పుకోవాచు. 

 

అప్పటి వరకు జగపతి బాబుని ప్రేక్షకులు ఒక కోణం లోనే చూసారు. కాని ఆ సినిమా ద్వారా ఆయనలో ఉన్న విలన్ ని టాలీవుడ్ చూసి షాక్ అయింది అనే చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఎందరో అగ్ర హీరోలు తమ సినిమాల్లో ఆయన ఉండాలని కోరుకున్న సందర్భాలు ఉన్నాయి. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఇలా కీలక హీరోల సినిమాల్లో ఆయన కీలక పాత్రలు చేసారు. అక్కడి నుంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. అక్కడి నుంచి భారీ పారితోషికం తీసుకున్న నటుడిగా ఆయన నిలబడ్డారు. 

 

లెజెండ్ సినిమా ద్వారా ఆయన ఒక స్థాయికి వెళ్ళారు. ఆర్ధికంగా కూడా జగపతి బాబు నిలబడ్డారు. తండ్రి మంచి నిర్మాత అయినా సరే ఆయన కెరీర్ లో ఇబ్బంది పడ్డారు. ఎన్నో సినిమాలు చేసినా సరే ఆయన నిలబడలేకపోయారు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఆయన దూసుకుపోతున్నారు. ఆర్ధికంగా ఒక స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇతర భాషలలో కూడా ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. హింది లో కూడా ఆయనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీనితో కెరీర్ లో ఇప్పుడు పీక్ స్టేజి లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: