పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో ఎంతో క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, నోటా వంటి మూడు డిజాస్టర్ సినిమాలను చవిచూసి తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు. దీంతో విజయ్ దేవరకొండ తాను చేస్తున్న తప్పులు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులోని భాగంగానే అతను ఎక్కువగా మాస్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి యాక్షన్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా చేస్తున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి మంచి హిట్ సాధిస్తానన్న విశ్వాసంతో ఉన్నారు.


ఈ సినిమాని మినహాయించి.. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఓ కొత్త సినిమా చేయబోతున్నానని విజయ్ దేవరకొండ ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రంగస్థలం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ప్రసాదించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. టాలెంటెడ్ నటుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఎటువంటి సినిమాను తెరకెక్కిస్తున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.


ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ఎంత మాస్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన ఒక కుర్ర హీరో కోసం మంచి స్క్రిప్టును రెడీ చేస్తున్నారట. బాలకృష్ణతో సినిమా పూర్తవ్వగానే వెంటనే తన తదుపరి సినిమాని పట్టాలెక్కించబోతున్నారని సమాచారం. అయితే తాను రాసుకున్న స్క్రిప్ట్ కి విజయ్ దేవరకొండ కరెక్ట్ గా సూట్ అవుతారని.. బోయపాటి శ్రీను భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయని... విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని కూడా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ ఎక్కువగా మాస్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా వీళ్లిద్దరి కాంబో పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: