ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలితో వచ్చిన ఇమేజ్ తోనే ప్రభాస్ ప్రతి సినిమా తెరకెక్కుతోంది. సాహో తెలుగులో ఫ్లాప్ అయినా.. బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు సాధించింది. దీంతో ప్రభాస్ కు నార్త్ ఇండియా క్రేజ్ ఉందని ప్రూవ్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ కూడా ఆ తరహాలోనే తెరకెక్కుతోంది. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభాస్ స్టిల్ రిలీజ్ చేసింది యూవీ క్రియేషన్స్ సంస్థ. అయితే.. ఈ పోస్టర్ లో చిన్న పొరపాటు జరిగిందని తెలుస్తోంది.


రాధే శ్యామ్ కు సంగీతం అందించేది ఎవరో అంటూ రకరకాల పేర్లు వైరల్ అయ్యాయి. అయితే.. ఫైనల్ గా డియర్ కామ్రేడ్ కు సంగీతం ఇచ్చిన తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్ ను రంగంలోకి దించారు. అయితే.. రాధేశ్యామ్ కు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో మాత్రమే సంగీతం అందిస్తున్నాడు ప్రభాకర్. హిందీకి వేరే సంగీత దర్శకుడు పని చేయబోతున్నట్టు తెలుస్తోంది. కానీ.. ప్రభాస్ ప్రీ బర్త్ డే పోస్టర్ లో హిందీ పోస్టర్ లో కూడా జస్టిన్ ప్రభాకర్ పేరు వేసి పోస్టర్ రిలీజ్ చేశారు.


వెంటనే తేరుకున్నారో.. ఏమో.. హిందీ పోస్టర్ ను రీ-రిలీజ్ చేశారు. ఈసారి రిలీజ్ చేసిన హిందీ పోస్టర్ లో జస్టిన్ ప్రభాకర్ పేరు లేదు. హిందీ వెర్షన్ కు సంగీతం అందించే దర్శకుడి పేరు కూడా మెన్షన్ చేయలేదు. మరి.. హిందీలో రాధేశ్యామ్ కు సంగీతం అందించేది ఎవరో మేకర్స్ రివీల్ చేయాల్సి ఉంది. మొత్తానికి రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ హ్యాండ్ సమ్ లుక్ లో ఉన్నాడు. వింటేజ్ కార్.. ఐరోపా బ్యాక్ డ్రాప్ తో లుక్ అదిరిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: