తొలిసారిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి పేరు దక్కించుకున్న కాజల్, ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ సినిమా ద్వారా మంచి క్రేజ్, గుర్తింపు దక్కించుకుంది. వాటి అనంతరం ఏకంగా దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా మగధీరలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కాజల్ ఆ సినిమాతో అతి పెద్ద స్థాయి విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది.
ఇక అక్కడి నుంచి వరుస ఆఫర్లతో కొనసాగిన కాజల్ హిందీ, తమిళ్ లో కూడా పలు సినిమాలను చేస్తూ ముందుకు సాగింది. ఇక అతి త్వరలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకోనున్న కాజల్ అగర్వాల్, మొదటి నుండి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో తన సినీ, వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల కొన్నాళ్ళ క్రితం ఒకానొక సందర్భంలో తన ఫేస్ కి ఏమాత్రం మేకప్ లేకుండా సహజత్వంగా దిగిన ఫోటో ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి అందరికీ భారీ షాక్ ఇచ్చిన కాజల్, తనకు సంబంధించిన వ్యక్తులకు అలానే తన అభిమానులకు తన గురించి పూర్తిగా తెలియాలని అందుకనే తన మేకప్ లేకుండా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఆమె చెప్పారు. అయితే ఆ ఫోటోలు పోస్ట్ చేయడానికి తాను ఏమాత్రం సిగ్గుపడలేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు.


ఈ రంగుల ప్రపంచంలో ఏ హీరోయిన్ అయినా హీరో అయినా తమ ఫేస్ కి మేకప్ లేకుండా ఫోటో దిగాలంటేనే ఇష్టపడరని, అటువంటిది కాజల్ ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో అందరికీ తెలియాలని పోస్ట్ చేసారు అంటే ఆమెకు ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఎటువంటిదో అర్ధమవుతుందని పలువురు నెటిజన్లు ఆమెను పొగుడుతూ కామెంట్స్ చేయడం జరిగింది. కాగా ఆ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా డేరింగ్ అండ్ డాషింగ్ గా తన ఫోటోని సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా ఆమె పోస్ట్ చేసిన విషయాన్ని ఇప్పటికీ పలువురు కొనియాడుతూ, నిజంగా కాజల్ టాలీవుడ్ లేడీ క్వీన్ అని అంటూ తమ సోషల్ మీడియా ద్వారా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తూనే చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: