రీ-ఎంట్రీలో వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ కు ట్రీట్ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి రెండు రీమేక్ సినిమాలు చేయాలని నిర్ణయించారు. మెగాస్టార్ తన రీ-ఎంట్రీ కూడా తమిళ సూపర్ హిట్ ‘కత్తి’ సినిమాతోనే చేశాడు. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ నంబర్ 150’ పేరుతో రీమేక్ చేశారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ‘సైరా’ చిత్రంతో ప్రేక్షకులను మురిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ పక్కన పెడితే.. ఆయన మిగతా ప్రాజెక్టులు కూడా రీమేక్ సినిమాలే.

మళయాళంలో సూపర్ హిట్ కొట్టిన 'లూసిఫర్'.. అలాగే తమిళ్ హిట్ సినిమా 'వేదాళమ్' చిత్రాలను రీమేక్ చేయాలని చిరంజీవి డిసైడ్ అయ్యారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే 'లూసిఫర్' తెలుగు వెర్షన్ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ ఎమోషనల్ డ్రామా 'వేదాళమ్' చిత్రాన్ని చిరు తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలను లైన్ లో పెట్టిన చిరంజీవి.. ముందుగా ఏ చిత్రాన్ని ప్రారంభిస్తారు? అనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది సెట్స్ పై ఉండగానే 'లూసిఫర్' రీమేక్ ని జనవరి 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 'ఆచార్య' షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మోహన్ రాజా సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే అదే సమయంలో లేట్ చేయకుండా మెహర్ రమేష్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నాడట. 'వేదాళమ్' తెలుగు రీమేక్ ని కూడా ఫిబ్రవరిలో పట్టాలెక్కించేయాలని చూస్తున్నాడట. 'లూసిఫర్'తో పాటు ప్యారలల్ గా ఈ సినిమా చిత్రీ కరణ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట మన మెగాస్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: