‘ఉప్పెన’ సక్సస్ తో వైష్ణవ్ తేజ్ పేరు మారు మ్రోగిపోతోంది. ప్రస్తుతం ఈ మెగా మేనల్లుడి పారితోషికం మూడు కోట్ల స్థాయికి చేరుకుంది అంటే ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ భవిష్యత్ ను ఏవిదంగా మార్చేసిందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల దృష్టి అంతా ఈ యంగ్ హీరో రెండవ సినిమా పైనే ఉంది.


క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌ లో ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో  రూపొందిన ఈ మూవీకి ‘కొండపొలం’ అనే పేరును ఇప్పటివరకు అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయి కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌ లో ఎక్కువు శాతం చిత్రీకరించారు.


ప్రముఖ రచయిత సున్నపు రెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన ప్రముఖ నవల ‘కొండపోలం’ క్రిష్ కు బాగా నచ్చడంతో ఈ నవల ఆధారంగా ఈ మూవీని తీసారు. ఈ మూవీ టైటిల్ ను ఇప్పుడు  ‘జంగిల్ బుక్’ గా మార్చారు అని తెలుస్తోంది. ‘ఉప్పెన’ మ్యానియాతో ఈ మూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌ కు అమ్మాలని ముందుగా అనుకున్నారట.  


అయితే ‘ఉప్పెన’ భారీ హిట్ కావడంతో బయ్యర్ల నుండి వస్తున్న భారీ ఆఫర్స్ లతో ఈ మూవీ నిర్మాతల అలోచనలు మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు క్యాంప్ నుండి బయటకు వచ్చిన లక్ష్మణ్ నైజాం ప్రాంతానికి సంబంధించి 11 కోట్లకు కొన్నాడని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమా టోటల్ బిజినెస్ 30కోట్ల చేరువలో జరిగిందని టాక్. దీనికితోడు ఈ మూవీని కొనడానికి నెట్ ఫ్లిక్స్ కూడ ముందుకు రావడంతో ఈ మూవీ విడుదల కాకుండానే ఈ మూవీ నిర్మాతలకు 15 కోట్లలకు పైగా లాభం వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: