బిగ్‌ బాస్‌-5 మొదలై అప్పుడే సెకండ్‌ వీక్ ఎండింగ్‌కు చేరింది. మామూలుగా శని, ఆదివారాల్లో నాగార్జున హౌస్‌కు వచ్చి సభ్యులు అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తారన్న విషయం విదితమే. కానీ ఈసారి వీకెండ్‌ బిగ్‌ బాస్‌ షో ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌గా నిలుస్తుందని ప్రోమోని బట్టి తెలుస్తోంది. ఇవాళ్టి షోలో నాగ్‌తోపాటు ఇంకా ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్‌లు షోలో కనిపించి అలరించనున్నారు. ఇదే సమయంలో ఈ వీక్‌ మొత్తమ్మీద జరిగిన పరిణామాలపై నాగ్‌ సమీక్ష చేపట్టడం సందడి వాతావరణానికి  దారితీసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇది ప్రతి వీకెండ్‌లో కొనసాగేదే అయినప్పటికీ.. ఈ వీక్‌ మాత్రం ప్రత్యేకంగా కనిపించనుంది. ఇందుకు కారణమేమిటి అనే విషయానికి వస్తే- స్టార్‌ మాతో హాట్‌ స్టార్‌ సంస్థ ఒప్పందంలో ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ తేజ్‌ కొన్ని రోజులుగా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించబడ్డారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ఇవాళ్టి బిగ్‌బాస్‌ షోలో నాగ్‌ ప్రకటిస్తారు. దీంతో బిగ్‌బాస్‌ వీకెండ్‌ షో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక ఈ వారంలో రిలీజ్‌ అయిన మాస్ట్రో చిత్ర యూనిట్‌ సైతం తమ ప్రమోషన్స్‌కు గాను బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించింది. హీరో నితిన్‌కు జంటగా హీరోయిన్‌ నభా నటేష్‌ మాస్ట్రో సినిమాలో నటించింది. ఇందులో తమన్నా కూడా ఒక కీ రోల్‌లో నటించింది.  ఈ మూవీ థియేటర్‌లలో రిలీజ్‌ అవుతుందని అంతా అనుకున్నా ఆఖరుకి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లోనే డైరెక్ట్‌గా రిలీజ్‌ చేసేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన సంగతిని చెబుతూ.. మాస్ట్రో మూవీ ప్రమోషన్స్‌ చేసుకోవడానికి బిగ్‌ బాస్‌ స్టేజిని సెలెక్ట్‌ చేసుకుంది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సంస్థ మేనేజ్‌మెంట్. కాగా ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి షూటింగ్‌ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో రిలీజ్ చేశారు.

వాస్తవానికి ఇప్పుడన్ని ఓటీటీ సంస్థలు తెలుగు సినిమాలపై స్పెషల్‌ ఫోకస్‌ చేశాయి. భారత్ విషయానికొస్తే హిందీ అనంతరం భారీ మార్కెట్ అయిన తెలుగుపై ఓటీటీ సంస్థలు అన్నీ దృష్టి కేంద్రీకరించాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సైతం తెలుగుపై స్పెషల్‌ ఫోకస్‌ చేసింది. దీంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను డిస్నీ హాట్‌ స్టార్‌ బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది. దీన్ని ఇవాళ్టి బిగ్‌ బాస్‌ షోలో ప్రమోట్‌ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: