సినీ ఇండస్ట్రీలో నటి సుధ గురించి ఏ ఒక్కరికి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈమె ముఖ్యంగా అక్క పాత్రలో, వదిన పాత్రలో, తల్లి పాత్రలో అలరించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీ లో నటించిన తీరుకు తెలుగింటి ఆడపడుచు గా మారిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న అందరి టాప్ హీరోలతో నటించి మంచి గుర్తింపు ఘడించింది. తెలుగు, తమిళం, మలయాళం ,హిందీ భాషా చిత్రాలలో సుధా సుమారుగా ఏడు వందల కుపైగా చిత్రాలలో నటించి చెరగని ముద్రను వేసుకుంది.

500కు పైగా తెలుగు సినిమాల్లో నటించడం గమనార్హం. ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు వంటి ఎంతో మంది స్టార్ హీరోలకు తల్లిగా నటించింది. ఇక సుధా అసలు పేరు వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే..సుధా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె.. సుధా కంటే ముందే  నలుగురు మగ పిల్లలు పుట్టడంతో.. ఇక ఆడపిల్లలు పుట్ట రేమో అని సుధా వాళ్ళ నానమ్మ భయపడుతున్న సమయంలో, సుధా పుట్టి వారింటికి వరంగా మారిందట.. ఇక ఆడపిల్ల పుట్టిందని సుధా వాళ్ళ నానమ్మ ఏదైనా గుడ్డ వుంటే ఇవ్వండి అని అడగగానే , వాళ్ళ నాన్న ఆ ఆనందం తట్టుకోలేక పొంగిపోయి ఆయన కట్టుకున్న పంచ తీసి ఇచ్చాడట..


అలా ఎంతో ఆనందోత్సాహాలతో సుధా పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు వారి తల్లిదండ్రులు. అయితే ఈమె పేరు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే.. వాళ్ళ నానమ్మ  ఏ పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో సుధా వాళ్ల పెదనాన్న సాంస్క్రిట్ పండితుడు. ఇక సుధా వాళ్ళ నాన్న వెళ్లి వాళ్ల పెదనాన్న ను ఏ పేరు పెడితే బాగుంటుంది అన్నయ్య అని అడిగినప్పుడు, సుధా అని పేరు పెట్టండి రా.. సుధ అంటే అమృతం.. ఎన్నో ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టి మన ఇంటికి అదృష్టం వరించింది.. కాబట్టి సుధ అని పెట్టండి అని చెప్పారట. ఇక సినీ ఇండస్ట్రీలో సుధా పేరును మార్చాలని దర్శక నిర్మాతలు చూసినప్పటికీ , ఆమె తల్లి ఒప్పుకోకపోవడంతో ఇక ఆమె అసలు పేరు ఇప్పటికీ సుధ గానే  కొనసాగుతోంది.. నాటికీ నేటికీ చెక్కుచెదరని అందంతో సినీ ఇండస్ట్రీలో సహాయక పాత్రలో మంచి గుర్తింపు పొందింది సుధ.మరింత సమాచారం తెలుసుకోండి: