నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంతా కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సమంత విడాకులు తీసుకోవడం పట్ల అక్కినేని కుటుంబంలో ఉన్న కొంతమంది ఆమెను ఇబ్బంది పెడుతున్నారని ఈ చర్య ఎంతమాత్రం మంచిదికాదని అనవసరంగా సమంత తొందర పడిందని కేవలం మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువగా టార్గెట్ చేయడం అలాగే సమంత పిల్లల విషయంలో ఆసక్తి చూపించకపోవడంతో అక్కినేని ఫ్యామిలీ సీరియస్ గా ఉందని పిల్లలను కనడం ఇష్టం లేక ఆమె నాగచైతన్య తో దూరంగాఉందని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు సమంత సోషల్ మీడియా విషయంలో చాలా సీరియస్ గా ఉందని ఇక నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి ఆమె ఎంత మాత్రం కూడా ఇష్టపడటం లేదని నాగచైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఆమె మతంను వ్యక్తిత్వాన్ని బాగా టార్గెట్ చేస్తూ కొంత మంది వ్యాఖ్యలు చేశారు. దీనితో సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆలోచనలను సమంత ఉందని అందుకే త్వరలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను డి ఆక్టివేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం సమంత కాస్త సినిమాల మీద దృష్టిపెట్టి ఇటీవలి కాలంలో ఇతర భాషలలో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతుందని ప్రధానంగా బాలీవుడ్ లో ఉన్న పరిచయాలతో బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే సమంత విషయంలో మాత్రం టాలీవుడ్లో కొంతమంది అభిమానులు చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించి ఆమె కోర్టులో పరువునష్టం కింద కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్ల గురించి కేసు కూడా వేశారు. మరి భవిష్యత్తులో సమంత ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం సమంత తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: