అక్కినేని
నాగచైతన్య కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. ఆయన
తండ్రి అక్కినేని
నాగార్జున మొదటి భార్యకు
నాగచైతన్య జన్మించగా ఆ తర్వాత ఆయనతో అభిప్రాయ భేదాల కారణంగా చైతు తల్లి విడిపోయింది. ఆ తర్వాత
నాగార్జున హీరోయిన్
అమల ను
పెళ్లి చేసుకొని అక్కినేని
అఖిల్ కు జన్మనిచ్చాడు. ఆ విధంగా అక్కినేని వంశం నుంచి ఇద్దరు హీరోలు
సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఆ విధంగా ఈ రోజు
నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
అక్కినేని
నాగచైతన్య కు తమ్ముడు
అఖిల్ ఒక్కడే కాదు మరొక తమ్ముడు కూడా ఉన్నాడు అంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్
మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియని నిజం అనే చెప్పాలి. చైతు కి తమ్ముడు అక్కినేని వంశం నుంచి కాదు కానీ ఓ తమ్ముడు కూడా ఉన్నాడట. అయితే తమ్ముడు ఉండడం పట్ల పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు కానీ ఆ తమ్ముడు ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.
నాగార్జున మొదటి
భార్య నుంచి విడిపోయిన కూడా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది అని చెప్పవచ్చు.
వారి కుటుంబ వేడుకల్లో అందరూ కలసి మెలసి ఆ వేడుకల్లో పాల్గొంటారు. స్నేహంగా ఉంటారు. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు.
నాగార్జున మొదటి
భార్య తన నుండి విడిపోయిన తర్వాత ఓ బిజినెస్ మెన్ ను
పెళ్లి చేసుకోగా వారిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు ఎందుకు మొదటి నుంచి దీనిపై సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారో తెలియదు కానీ ఆ రోజుల్లో
లక్ష్మీ రెండో వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇక చైతు
సమంత పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరగగా వారికి ఇటీవలే విడాకులు అయ్యాయి.