టాలీవుడ్ అంటేనే హీరోలకు నిలయం. ఆల్ ఏజ్ గ్రూప్ హీరోలు ఇక్కడ కనిపిస్తారు. మరే సినీ పరిశ్రమలో లేనంతమంది హీరోలు కేవలం తెలుగు చిత్ర సీమకే ఉన్నాయంటే అది గొప్ప విషయంగానే చూడాలి. ఆరు పదులు దాటినా కూడా మన హీరోలు ఇంకా జోరు చేసి మరీ నటిస్తున్నారు.

అది కూడా హీరోలుగానే వారు దూసుకెళ్తున్నారు. యంగ్ హీరోలతో సరిసమానంగా పోటీ పడుతున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. సీనియర్ హీరోలు యాక్షన్ అంటున్నారు. అంటే పక్కా మాస్ మూవీస్ ని వారు చేస్తున్నారు. యంగ్ హీరోలు ఫైట్స్ చేశారు అంటే అర్ధం చేసుకోవచ్చు. సీనియర్ హీరోలు ఒక్క ఫైట్ చేసినా ఒకే అనుకోవచ్చు. కానీ అలా జరగడంలేదు. ఫుల్ ఆఫ్ యాక్షన్ తో తమ సినిమాలను నింపేస్తున్నారు.

దానికి బాలయ్య అఖండ ఒక ఉదాహరణ. ఈ మూవీలో బాలయ్య ఏకంగా 45 నిముషాలకు సరిపడా యాక్షన్ సీన్లు చేశారు అంటే మెచ్చుకుని తీరాల్సిందే. దీని తరువాత గోపీచంద్ మలినేని మూవీలో కూడా యాక్షన్ పార్ట్ అదుర్స్ అంటున్నారు. ఇక మెగాస్టార్ ఆచార్య మూవీలో కూడా యాక్షన్ ఒక్క లెక్కన ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా చేయబోయే ఇతర సినిమాలలో కూడా చిరంజీవి యాక్షన్ సీన్లు బాగా దట్టిస్తున్నారుట.

ఇక విక్టరీ వెంకటేష్ కూడా అదే రూట్లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ హిట్ నారప్ప యాక్షన్ లోడ్ ఎంతో చెప్పేసింది. ఇక దృశ్యం టూ మూవీలో కూడా యాక్షన్ అదరగొట్టేలా ఉంటుందని టాక్. ఇక నాగార్జున కూడా ది ఘోస్ట్ పేరిట ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో మాస్ అండ్ యాక్షన్ అంటున్నారు. ఈ మూవీలో నాగ్  యాక్షన్ సీన్లు పెద్ద  హైలెట్ అని చెబుతున్నారు. మొత్తానికి మన సీనియర్లు అసలు తగ్గడంలేదు. దీంతో వారి ఎనర్జీ లెవెల్స్ ని చూసి ఏమైందబ్బా అనుకుంటున్నారు ఆడియన్స్. ఏది ఏమైనా వారు గ్రేట్ అనాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: