మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పలు సినిమాలు ఇప్పుడు తెరకెక్కుతున్నాయి. అయితే ఏయే చిత్రాలు హీరోగా చేస్తున్నాడు అనే విషయాన్ని పక్కన పెడితే నిర్మాతగా పలు చిత్రాలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. నటుడిగా నిర్మాతగా భారీస్థాయిలో బిజీగా ఉన్న రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.

సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తుందని మెగా అభిమానులు నమ్ముతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ఈ విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అన్న ఆగ్రహం ప్రేక్షకులలో నెలకొంటుంది. ముఖ్యంగా నిర్మాత రామ్ చరణ్ పై ఎక్కువగా మండిపడుతున్నారు ప్రేక్షకులు.

మధ్యలో చాలా పెద్ద సినిమాలు విడుదలైన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయకుండా ఉంచడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఆలస్యం చేస్తూ ఈ సినిమాను విడుదల చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి తన సినిమాల విడుదల ను ఎంతో చక్కగా క్లారిటీగా చేసుకుంటున్న రామ్ చరణ్సినిమా విడుదల విషయంలో ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అన్న విమర్శ కూడా ఆయన అందుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా గురించి అప్డేట్ త్వరగా ఇస్తే వారి కోపం చల్లారే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన కమర్షియల్ సినిమా ఇది. ఈ చిత్రం లో కాజల్ హీరోయిన్ గా నటించగా చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు ఆయన సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: