బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా టైటిల్ గెలిచిన సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి సీజన్ విన్నర్ గా సత్తా చాటడంతో వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ సన్నీకి ఇప్పటికే రెండు సినిమాల ఆఫర్లు రాగా ఈమధ్యనే ఏ.టి.ఎం వెబ్ సీరీస్ ఛాన్స్ కూడా వచ్చింది. ఇక లేటెస్ట్ గా సన్నీకి మరో లక్కీ ఛాన్స్ కూడా వచ్చిందని తెలుస్తుంది.

సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం సినిమాలకు డైలాగ్ రైటర్ గా సత్తా చాటిన డైమండ్ రత్నబాబు డైరక్షన్ లో సన్నీ హీరోగా ఒక సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు లీడ్ రోల్ లో సన్నాఫ్ ఇండియా సినిమా చేశారు డైమండ్ రత్నబాబు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు సన్నీతో మరో సినిమాకు సిద్ధమయ్యాడు డైమండ్ రత్నబాబు.

బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సన్నీకి ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటికే సకల గుణాధిరామ సినిమా చేస్తున్న సన్నీ దానితో పాటుగా హరీష్ శంకర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఏ.టి.ఎం వెబ్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండిటితో పాటుగా డైమండ్ రత్నబాబు డైరక్షన్ లో సినిమా కూడా సన్నీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలతో సన్నీ హీరోగా వెండితెర మీద తన సత్తా చాటుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ఎవరు కూడా కెరియర్ లో అంత స్ట్రాంగ్ గా కనిపించలేదు. మరి సన్నీ అయినా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి. డైమండ్ రత్నబాబు డైరక్షన్ లో సన్నీ చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: