సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ చేసే రచ్చ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ గొడవలు తోనే ఈయన రెండు అవుతూ ఉంటాడు.అంతేకాకుండా సంచలనం ఎక్కడ ఉంటే అక్కడ రామ్‌ గోపాల్‌ వర్మ ఉంటారు. ఇకపోతే ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ తిండి లేకుండా అయినా బతుకుతాడేమో కానీ కాంట్రవర్సీ లేకుండా మాత్రం బతకలేరు.ఇకపోతే ఈయన తీసే సినిమాల నుంచి మాట్లాడే విధానం వరకు ప్రతీదాంట్లో వర్మ మార్క్‌ ఉండాల్సిందే. అయితే ఇక రామ్ గోపాల్ వర్మను ఎంత మంది విమర్శించే వారు ఉంటారో అంతే స్థాయిలో పొగిడే వారు కూడా ఉంటారు. 

అంతేకాక సమాజంలో జరిగే అంశాలను సినిమా కథాంశంగా తీసుకొని నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. ఇక అసలు విషయం ఏంటంటే ఈ క్రమంలోనే తాజాగా కొండ మూరళి, సురేఖ జీవిత కథ ఆధారంగా వర్మ ‘కొండా’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.అయితే  జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉంది. అంతేకాదు వర్మ సైతం ప్రమోషన్స్‌లో జోరును పెంచారు. కాగా ఈ క్రమంలోనే తాజాగా బెజవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. అయితే ఇక కొండ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఇక ఆయన మాట్లాడుతూ దేవుడిని పెద్దగా నమ్మని వర్మ పేరులో ‘రాముడు, గోపాలుడు’ పేర్లు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నకు బదులిస్తూ.. నిజానికి తన అసలు పేరు ‘రామ్‌ పండు’ అని,ఇకపోతే  స్కూల్‌లో అందరూ ఆ పేరు విని ఏడిపిస్తారని చివరి క్షణంలో ఆయన నాన్న ‘రామ్‌ గోపాల్‌ వర్మ’గా మార్చారని వర్మ చెప్పుకొచ్చారు.అయితే  తన పేరును మార్చుకోవాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు వర్మ.ఇక  ఇలా తన కెరీర్‌లో తొలిసారి తన అసలు పేరు చెప్పి వర్మ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: