ఈమధ్య బిగ్ బాస్ షోని చూసేవాళ్ళలో చాలా మందికి లేనిపోని డౌట్ లు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ సెలెక్షన్ దగ్గర్నుంచి టైటిల్ విన్నర్ ని ప్రకటించే వరకూ అన్ని డౌట్ లే.
ఎందుకంటే కంటెస్టెంట్ లను ఎలా సెలెక్ట్ చేస్తారు అనే దానిలో ప్రాసెస్ ఏ మాత్రం ఉండదు. ఒకవేళ అలా ఉన్నా కూడా మనకు బయటకు చెప్పారు. అలాగే ఈ సీజన్లో కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పి, చివరికి పాపులర్ యూట్యూబర్ అయినా ఆది రెడ్డిని కామన్ మాన్ కోటాలో తీసుకువచ్చారు. ఇక చాలా మంది కామన్ మంది అప్లికేషన్స్ పెట్టి ఆడిషన్స్ కి కూడా వెళ్లారు.ఇక వారి పరిస్థితి గోవిందా అని చెప్పుకోవచ్చు. ప్రతివారం ఓటింగ్ పేరుతో ఎలా జిమ్మిక్కులు చేస్తారో ఈ కంటెస్టెంట్ ల ఎంపిక విషయంలో కూడా అలాంటిదే జరిగిందన్నమాట. ఇక నామినేషన్,ఓటింగ్, ఎలిమినేషన్,విన్నర్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్ని చాలా సీక్రెట్గానే ఉంటాయి.

ఏది కూడా మనకు తెలిసి జెన్యూన్ గా జరగదు అనిపిస్తుంది. చాలా మంది ఇంట్లో బాగా ఆడవాళ్లను బయటికి పంపిస్తుంటారు.కొత్త వాళ్ళని హౌస్ లోకి తీసుకు వస్తారు. ఇక హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లు చాలా మంది రికమెండేషన్ తోనే వస్తూ ఉంటారట. ఎందుకంటే వారి పరిచయాలను బట్టి బిగ్ బాస్ అవకాశాలు వాళ్లకు వస్తుంటాయని బయట టాక్. ఎందుకంటే వాళ్ళ షో కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్లను తీసుకుంటారు. ఒకవేళ వాళ్లతో ఇబ్బంది అనిపిస్తే పంపిస్తారు. ఇక ఇవన్నీ పక్కనపెడితే ఈ సీజన్ లో కొత్తగా కనిపించేది ఏంటంటే.. శని,ఆదివారాల్లో నాగార్జున వచ్చినప్పుడు కొంతమంది ఆడియన్స్ స్టేజ్ మీద కనిపిస్తారు. ఇక అలాగే ఇంట్లో వాళ్ళు ఎలా ఆడుతున్నారో వాళ్లతో చెప్పిస్తారు.. అలాగే ఇంట్లో వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని దాని పై ఆడియన్స్ ఒపీనియన్ కూడా అడుగుతారు. ఇక ఈ విషయంలో ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అంటాడు నాగార్జున. దీంతో ఆడియన్స్ టీవీ స్క్రీన్ పై కనిపిస్తారు. ఇక టీవీలో కనిపించడంతో చాలామంది ఆడియన్స్ బిగ్ బాస్ షో కి వెళ్ళడానికి తెగ ట్రై చేస్తున్నారు.

అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. అసలు నాగార్జున ముందు కూర్చొని ఆన్సర్ చెప్పే వాళ్ళు అసలు ఆడియెన్సే కాదట. వాళ్లు కూడా బిగ్బాస్ యూనిట్ సెట్టింగ్ లో భాగమే నట. వారికి డబ్బులు ఇచ్చి మరి ఆడియన్స్ గా చూపిస్తున్నారు అంటూ బయట వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆదివారం రోజు శ్రీముఖి హోస్ట్ గా చేసే స్టార్ మా పరివార్ కూడా చాలా మంది వ్యక్తులు వస్తారు. అందులో కొంతమంది ఆడియన్స్ కూడా ఉంటారు. ఇక ఈ ఆడియన్స్ లో ఓ అమ్మాయి పై పదేపదే క్లోజ్ లు వేసి చూపించారు. ఇక ఈ అమ్మాయిని చూసిన చాలా మంది ఈమెను ఎక్కడో చూసామే అని అనుకునేసరికి అసలు విషయం బయటపడింది. ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు బిగ్ బాస్ షో లో కనిపించింది శ్రీముఖి లో కనిపించిన అమ్మాయే.ఈమె అర్జున్ కళ్యాణ్ కి శ్రీ సత్య కి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉంది అనే విషయం మాట్లాడింది. ఇక దీంతో అందరికీ క్లారిటీ వచ్చింది.. బిగ్ బాస్ షో కి వచ్చే ఆడియన్స్ కూడా అందరు డబ్బులు ఇచ్చే తీసుకువస్తున్నారని అందరూ దొంగలే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: