ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సల్మాన్ ఖాన్ హీరోగా మాత్రమే కాకుండా గొప్ప వ్యక్తిగా తన మంచి మనసును ప్రతిసారి చాటుకుంటాడు. ప్రజలు ఆపదలో ఉన్నారంటే తన వంతు సహాయం చేస్తూనే ఉంటాడు. ఈ హీరో సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా వ్యాపారాలు కూడా వ్యవహరిస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్ గా ముందు వరుసలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలోనూ నటించి సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చేవారికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటాడు. వారికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకుంటాడు.

 ఇదిలా ఉండగా.... గత కొద్ది రోజుల క్రితం సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఓ అగంతకుడు చొరబడేందుకు ప్రయత్నం చేశాడట. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలో సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న ఇంటి వద్ద జితేంద్ర కుమార్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి అనుమానస్పదంగా తిరుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని గుర్తించిన పోలీసులు హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా వేరే కారులో ఎక్కి సల్మాన్ ఖాన్ ఉంటున్న అపార్ట్మెంట్ లోకి ప్రవేశించాడు. వెంటనే అగంతకుడిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం జితేందర్ అనే వ్యక్తిపై విచారణ చేపడుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గతంలోనూ సల్మాన్ ఖాన్ పై ఓ అగంతకుడు అటాక్ చేయబోయే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలపై ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే సైఫ్ అలీఖాన్ పైన ఓ అగంతకుడు కత్తితో దాడి చేశాడు. తన ఇంట్లో ఉన్న పనిమనిషి మీద అటాక్ చేయడంతో సైఫ్ అలీ ఖాన్ అడ్డుకోబోయాడు. ఆ క్రమంలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం ఇతడి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉంది. బాలీవుడ్ సినీ నటుల మీద ఇలాంటి ఘటనలు జరగడంతో కొంతమంది సినీ ప్రముఖులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వారికి రక్షణ కావాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: