కేవలం కొద్దిగంటలే కొద్ది గంటల్లోనే ఎన్నో ఏళ్లు వేచిన మూమెంట్ రాబోతుంది.  గత కొన్ని ఏళ్లు గా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గద్దర్ అవార్డ్స్ వేడుక ఎట్టకేలకు అంగరంగ వైభవంగా జరగబోతుంది . తెలంగాణ రాష్ట్రంలో సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది.  కళా రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు .. దర్శకులకు .. నిర్మాతలకు సంగీత నిప్పుణులకు సాంకేతిక నిప్పులు అందరికీ అవార్డులు అందనున్నాయి . హైదరాబాద్ వేదికగా హైటెక్స్ లో ఎంతో గ్రాండ్గా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు తెలంగాణ ప్రభుత్వం .

తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గాను ఉత్తమ సినిమాలకు అవార్డు అందించడం విశేషం . అయితే గద్దర్ అవార్డ్స్ వేడుక మరి కొద్ది గంటల్లో ప్రారంభమవుతోంది అనగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ చేస్తున్న పేరు అల్లు అర్జున్ .దానికి రీజన్ కూడా ఉంది . పుష్ప సినిమా రిలీజ్ టైం లో తొక్కిసలాట జరిగిన కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనికి కారణం అల్లు అర్జున్ చేసిన రోడ్ షోనే అంటూ తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో పెట్టింది . అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది . అయితే రేవంత్ రెడ్డి కావాలనే పగతో అల్లు అర్జున్ ని అరెస్టు చేయించారు అని అల్లు అర్జున్ తన పేరు పుష్ప ఈవెంట్ చెప్పకపోవడం మనసులో పెట్టుకొని ఇదంతా చేశాడు అంటూ అప్పటిలో జనాలు చాలామంది మాట్లాడుకున్నారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి బన్నీ నటనను ప్రశంసించి మెచ్చుకొని మరి గద్దర్ అవార్డు ఆయన చేతుల మీదుగా ఇవ్వాలి . ఈ సీన్ కోసం బన్నీ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా చిరంజీవి - నాగార్జున - బాలయ్య - వెంకటేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాబోతూ ఉండడం గమనార్హం.  చిరంజీవికి - అల్లు అర్జున్ కి మధ్య వార్ జరుగుతుంది అంటూ గత కొంతకాలంగా టాక్ వినిపిస్తుంది . ఇప్పుడు చిరంజీవి కూడా స్టేజి ఎక్కితే అల్లు అర్జున్ ని ప్రశంసించాలి. ఎలా మాట్లాడుతాడు ..? ఏం మాట్లాడుతాడు..? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది . ఈ సీన్ కోసం అందరూ వెయిటింగ్ . గతంలో పుష్పప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలోనూ ఇలాగే జరిగింది. మెగా ఫ్యామిలీతో గొడవల తర్వాత స్టేజ్ ఎక్కిన అల్లు అర్జున్ ఏం మాట్లాడుతాడు..? ఎలా మాట్లాడుతాడు..? అని అంతా వెయిట్ చేశారు.  ఇప్పుడు సేమ్ టు సేమ్ చిరంజీవి - అల్లు అర్జున్ గురించి ఏం మాట్లాడుతాడు అనే విధంగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు . మరికొద్ది సేపట్లోనే దానికి క్లారిటీ రాబోతుంది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: