
ఇక టీజర్ విషయానికొస్తే పూర్తిగా రెబెల్ అభిమానుల అంచనాలను అందుకునేసిందనే చెప్పాలి . టీజర్ ప్రారంభంలోనే సంజయ్ దత్ "ఈ ఇల్లు నా దేహం లాంటిది . ఈ సంపద నా ప్రాణం నేను చనిపోయిన తర్వాత కూడా దీనిని నేను మాత్రమే అనుభవిస్తాను " అంటూ చెప్పే డైలాగ్ హైలెట్గా మారింది. ఇక విఎఫ్ఎక్స్ షాట్స్ హైలెట్ అయ్యాయి అనే చెప్పాలి . ముసలి , అనకొండ , పాము , దెయ్యం ఇలా ఎన్నో షాట్స్ ఫ్యాన్స్ ని బాగా ధ్రిల్ చేశాయి. బండి కొంచెం మెల్లగా అంటూ ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు . ఆ తర్వాత సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చూపిస్తారు. టీజర్ మొత్తానికి బాగా హైలైట్ గా మారింది . అయితే ఈ టీజర్ లో ఎవరు ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవిని ..సూపర్ స్టార్ రజనీకాంత్ ని అమితాబచ్చన్ ని కూడా యాడ్ చేయడం హైలైట్ గా మారింది.
టీజర్ లో అక్కడక్కడ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కనిపిస్తాయి . మరీ ముఖ్యంగా చిత్ర డైరెక్టర్ మారుతి మెగాస్టార్ చిరంజీవికి వీర అభిమాని. ఇది అందరికీ తెలిసిందే . తన ప్రతి సినిమాలోను చిరంజీవికి సంబంధించి ఏదో ఒక రిఫరెన్స్ ని వాడుతూ ఉంటాడు. ఈ చిత్రంలో చిరంజీవి పోస్టర్ ని వాడేసాడు . అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ డైలాగ్ లు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని ..అది సినిమాలో చూపించబోతున్నారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు మారుతి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అని అనుకున్నాడు . కానీ అది కుదరలేదు. కనీసం ఈ విధంగా ఆయన తన కోరిక నెరవేర్చుకుపోతున్నాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ హీరో చిరంజీవి - పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా తన సినిమాల విషయంలో వాడేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాజా సాబ్ సినిమా ఏ విధంగా ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుందో..??