సల్మాన్ ఖాన్ , ఐశ్వర్యారాయ్ , అజయ్ దేవగన్ కీలక పాత్రలో సంజయ్ లీల భ‌న్సాలి డైరెక్షన్లో వచ్చిన `హ‌ద్ దిల్ దే చుక్ స‌న‌మ్`. బాలీవుడ్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటి .. తండ్రి కారణంగా ప్రేమికులు ఎలా విడిపోయారు .. తిరిగి ఆ ప్రేమికులని క‌లపడానికి అజయ్ దేవగన్ ఎంతటి సాహసం చేశాడు ? అన్న పాయింట్ ను సంజయ్ ఎంతో సుజనాత్మకంగా తెర్కక్కించారు .. అలాగే సంజయ్ లీలా తీసిన లవ్ స్టోరీలో ఇది స్వచ్ఛమైన ప్రేమ కథ సినిమాగా నిలిచింది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుద‌లై 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది .. అయితే ఇప్పుడు తాజాగా అప్పటి జ్ఞాపకాలను సవాలను సంజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ..


ప్రధానంగా తాను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం .. ` ఖామోషీ: దిమ్యూజిక‌ల్` అలా అప్పటికే రిలీజ్ అయ్యి ప్లాఫ్ అయింది .. ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ కొత్త ప్రేమ కథను చూపించాలి అనుకున్నాను .. అలాగే అది ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండే పోవాలని బలంగా నిర్ణయం తీసుకున్న .. ఆ విధంగా వచ్చిన సినిమా నే `హ‌ద్ దిల్ దే చుక్ స‌న‌మ్` ఇందులో నందిని పాత్రకు ఐశ్వర్యారాయ్ ప్రాణం పట్టి నటించారు .. అలాగే నేను అనుకున్న దానికంటే గొప్పగా నటించింది .. డైరెక్టర్ విజన్‌కు తగ్గ నటీనటులు దొరికినప్పుడు ఇలాంటివి సాధ్యమవుతూ ఉంటాయి .. అలాగే ఐశ్వర్యను తెర పై చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం వేసేది ..


ప్రియురాలుగా ఎంతో గొప్పగా నటించింది .. సల్మాన్ ఖాన్ కూడా అంతే గొప్పగా నటించారు .. ఆయన ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు ప్రాణం పెట్టి నటించడంలో ఈ సినిమా ఇంత గొప్పగా నిలిచింది . సల్మాన్ , ఐశ్వర్య కలిసే విధంగా క్లైమాక్స్ సన్నివేశాలు మార్చమని చాలామంది కోరారు కానీ నా నిర్ణయం మాత్రం నేను మార్చుకోలేదు .. అనుకున్న‌ది అనుకున్నట్లు తీశాను .. అయితే .... ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్ నుంచి గట్టి ఒత్తిడి రావడంతో కొన్ని సన్నివేశాలను తనకు ఇష్టం లేకపోయినా మార్చాల్సి వచ్చిందని ఆ పాత విషయాలను గుర్తుచేసుకున్నాడు ..

మరింత సమాచారం తెలుసుకోండి: