
మరి ముఖ్యంగా ఈ సినిమాలో ధనుష్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ అంటూ ప్రశంసలు దక్కించేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో మెరిశారు. అయితే నాగార్జున తన స్థాయి మొత్తం పక్కన పెట్టేసి మరి ఈ సినిమాలో ధనుష్ దగ్గర దెబ్బలు తింటారు . ఇప్పటివరకు నాగార్జునను తన సినీ కెరియర్లో ఈ సినిమాలో దెబ్బలు తిన్న విధంగా మరి ఏ సినిమాలో కూడా చూసి ఉండరు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . నాగార్జున తన స్టేటస్ పక్కన పెట్టేసి ఇలా చేయడం అవసరమా అంటున్నారు..?
అయితే మరొక పక్క చాలామంది హీరోలు ఈ రోల్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి అయితే ఇలాంటి ఒక రోల్ చేయాలి అంటూ ఆశపడుతున్నారట . మెగాస్టార్ చిరంజీవి కూడా నాగార్జున బాటలో నడవాలి అని ఆలోచిస్తున్నారట . కుబేరలో నాగార్జున పాత్ర చిరంజీవికి బాగా నచ్చిందట . మంచి కథ ఉంటే ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న నటిస్తాను అంటూ చెప్పుకొస్తున్నారట . "కుబేర" సినిమాలో నాగార్జున సిబిఐ ఆఫీసర్ దీపక్ గా మంచి చెడు మధ్య సంఘర్షణ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు . ఈ పాత్ర పై పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంది . చిరంజీవి కూడా ఈ పాత్రను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలాంటి రోల్ లో నటించాలి అంటూ ఆశపడుతున్నారట . ఇండస్ట్రీలో ఇదే గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే కొందరు మాత్రం దీనిపట్ల నెగిటివ్గా స్పందిస్తున్నారు. నాగార్జుననే అక్కినేని ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు . మరి చిరంజీవి ఎందుకు ఇలాంటి ఒక రోల్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే అన్న సామెతతో ట్రోల్ చేస్తున్నారు..!