
సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ దగ్ధమైంది. అయితే ఇది ఒరిజినల్ ది కాదు. డమ్మీ హెలికాప్టర్ . దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు . ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గుర్రం గూడాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది . దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . గుర్రం గూడా లోని పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఇటీవల ఒక సినిమా షూట్ జరిగింది . అయితే ఆ షూటింగ్ నిమిత్తం ఒక డమ్మి హెలికాఫ్టర్ ని తయారు చేశారు . అక్కడకి తెచ్చిపెట్టారు .
కాగా కదపకుండా ఒక్కే చోట కొన్ని రోజులుగా అలాగే పెట్టడంతో ఆ హెలికాఫ్టర్ బ్లాస్ట్ అయినట్లు అక్కడ ఉండే వాళ్ళు చెప్పుకు వస్తున్నారు . శుక్రవారం అనూహ్యంగా ఈ హెలికాప్టర్ దగ్ధమైపోయింది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు మంటలు అంటించి ఉంటారు అని స్థానికులు అనుమాని స్తున్నారు . వెంటనే స్థానికులు మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు . అసలు ఎందుకు ఆ హెలికాప్టర్ ని అక్కడే వదిలేశారు..? సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఎందుకు అది డిస్మాండల్ చేయలేకపోయారు..? ఎవరైనా కావాలనే ఈ హెలికాఫ్టర్ కి నిప్పు అంటిచ్చారా..? అన్న కోణంలో విచారణ ప్రారంభించారు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . ఇటీవల దేశంలో జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్న మూమెంట్లో ఇలా హెలికాప్టర్ దగ్దం అవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..!