టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు . ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువలేకపోయిన మరికొన్ని రోజుల్లోనే ఈ వీరిద్దరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు వెంకీ హీరోగా రూపొందిన సినిమాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించకపోయినా ఆయన హీరో గా రూపొందిన నువ్వు నాకు నచ్చవ్ , మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు.

ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. మరికొంత కాలం లోనే వెంకీ , త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే త్రివిక్రమ్మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా చాలా వరకు కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లో ఈ టైటిల్ తో పాటు మూవీ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

సినిమా కథ పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంలో సాగబోతుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే విశాఖపట్నం లోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన 50 ఏళ్ల వ్యక్తి కథగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా వెంకీ , త్రివిక్రమ్ కాంబోలో మూవీ రూపొందబోతుంది అనే వార్త బయటకు రావడంతోనే ఈ కాంబో మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: