బాలీవుడ్ కండల వీరుడు స్టిల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.  ఆయన పై ఇప్పటికే హీరోయిన్లను తన చుట్టూ తిప్పుకుంటాడని, కొన్ని సార్లు వాళ్ల చెంపలు కూడా వాయిస్తుంటారని, కృష్ణ జింక, హిట్ అండ్ రన్ కేసులు గురించి తెలిసిందే.  ఇన్ని వివాదాలు ఉన్నా దేశంలో సల్మాన్ ని అభిమానించేవారు కోట్లలో ఉన్నారు. ఇక సల్మాన్ మంచి తనం గురించి చెప్పాలన్నా బోలెడు విశేషాలు ఉన్నాయి. 

బీయింగ్ హ్యూమన్ అనే స్వచ్ఛంద సంస్థతలో ఎంతో మంది అనాధ పిల్లలను, పెద్దలను ఆదుకుంటున్నారు. అందరినీ ఉత్సాహపరుస్తూ అందరితో కలివిడిగా ఉంటారు. ఈ మద్య పోతు రాజుల వద్ద కు వెళ్లి తన వీపు వాయించుకున్న విషయం తెలిసిందే.  అలాంటి సల్మాన్ ఖాన్ పై తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి బోల్డ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉందని.. సినిమాల్లో నటించి ఆ తరువాత మంచి పొలిటికల్ లీడర్ అనిపించుకోవాలనుందని తెలిపింది.

నటి హేమ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి మామూలు రచ్చ చేయలేదు..అందరినీ ఒక్క ఆట ఆడుకుంది. ఇక రవికృష్ణకు ఓ రకంగా నరకం చూపించింది..తన సూటి పోటి మాటలతో ఒకదశలో తట్టుకోలేని పరిస్థితికి వచ్చాడు.  మొత్తానికి మూడో వారంలో తమన్న ఎలిమినేట్ అయ్యింది.  తాజాగా తమన్నా మాట్లాడుతూ..సినీ పరిశ్రమలో అందరూ చెడ్డవాళ్లు అని అనడం లేదని, కానీ కొంతమని మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తారని.. తనకైతే ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. 


ఇక వర్జిన్ గురించి మాట్లాడుతూ..అందరూ నీతులు చెప్పేవాళ్లే అని, తాను వర్జిన్ కాదని తనకు  అబద్దాలు చెప్పడం రాదనీ వెల్లడించింది. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం వర్జినా? నేను కూడా అంతే' అంటూ 17 ఏళ్ల వయసులోనే కన్యత్వాన్ని పోగొట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: