గత కొంత కాలంగా ప్రభాస్ అడుగులు భారతీయ జనతా పార్టీ వైపు పడుతున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని ఖండిస్తూనే ఉన్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ‘సాహో’ షాక్ ను కూడ పట్టించుకోకుండా ప్రభాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవితం పై ప్రముఖ బాలీవుడ్ దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ రూపొంధించబోతున్న మూవీ ‘మన బైరాగి’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రభాస్ ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నాడు. ఈరోజు ప్రధానమంత్రి మోదీ 69వ పుట్టినరోజు సందర్భంగా ముంబాయ్ లో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించ బోతున్నట్లు ప్రముఖ పత్రిక హిందుస్తాన్ టైమ్స్ ఆసక్తికర న్యూస్ ప్రచురించింది. 

మోడీ జీవితం పై ఇప్పటికే ఒక బయోపిక్ వచ్చింది. వివేక్ ఆనంద్ ఒబ్రాయ్ మోడీ పాత్రలో నటించిన మూవీ ఈ సమ్మర్ లో ఎన్నికల తరువాత విడుదలైంది. అయితే సంజయ్ లీలా బన్సాలీ మూవీ ఎక్కువగా మోడీ జీవితంలో జరిగిన రాజకీయ సంఘటనలను ఆధారంగా చేసుకుని తీయబడుతున్నట్లు టాక్. ఇదే కాకుండా మోడీ జీవితం పై ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచన కూడ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

‘మోడీ జర్నీ ఆఫ్ ఎ కామన్ మేన్’ పేరుతో కూడ సంజయ్ లీలా బన్సాలీ ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచన కూడ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ వాతావరణానికి అనుగుణంగా ఉండే ఒక మూవీని చేస్తాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ‘సాహో’ పరాజయాన్ని లెక్క చేయకుండా తన వేగాన్ని మరింత పెంచుతూ ఇప్పుడు ఇలా ప్రభాస్ సంజయ్ లీలా బన్సాలీ లు కలవడం వెనుక ఎదో ఒక కారణం ఉండి ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే అసలు విషయం తెలియడానికి మరికొంత కాలం పట్టే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: