హీరోయిన్ అనే పదానికి సినిమాల్లో సావిత్రి కాలం నుండి నేటి సావిత్రి కీర్తి సురేష్ వరకు చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం లిప్ లాక్స్ కు ఎక్స్‌ఫోజింగ్ చేయడానికే పరిమితం అవుతున్నారన్నది అసలు వాస్తవం. నటించగలిగే కెపాసిటి  ఉన్నా సరైన అవకాశం రాక.. వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయి నటన సరిగా రాక కూడా వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు.నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళు ఉదాహరణగా కనిపిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళలో ఎక్కువమంది కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్  చేసుకున్నారు. 

పూజా హెగ్డే ముందు 'ముకుంద', 'ఓ లైలా కోసం' సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ ఆమెకి అప్పుడు గుర్తింపు గాని, అవకాశాలు రాలేదు. కానీ 'DJ'సినిమాలో బికినీ వేసి మరీ మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల సరసన వరుస అవకాశాలను అందుకుంటోంది.  అంతేకాదు ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా ఉన్న రష్మిక కూడా ముందు ' ఛలో ' సినిమాలో డీసెంట్‌గా కనిపించింది. అప్పుడు ఆమె ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. 'గీత గోవిందం' లో విజయ్ దేవరకొండ‌తో రెండు ఘాటు లిప్ లాక్స్ చేసేసరికి మాత్రం అంతా ఆమెపై ఫోకస్ చేసారు. ఇప్పడు బన్నీ, మహేష్ సినిమాల్లో ఆమె హీరోయిన్. చివరికి 'బాహుబలి' లో తమన్నా, 'సాహో' లో శ్రద్ధా కపూర్.. సినిమా ఏదయినా, హీరోయిన్ ఎవరయినా కూడా అందాల విందు చేస్తేనే ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

' ఆర్.ఎక్స్ 100 ' సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో పాయల్ రాజపుత్ హీరోతో కలిసి పండించిన రొమాన్స్ అన్న విషయం ఒప్పుకోవాల్సిందే. అయితే ఆ సినిమా తరువాత పాయల్ కు మళ్ళీ అలాంటి సినిమాలు, అదే తరహా రోల్స్ వచ్చాయి. చాలా కాలం చేయనని రిజక్ట్ చేసింది. కాని తన మీటర్ మొదటికే వచ్చింది. 'ఆర్.ఎక్స్ 100' లోనే పాయల్ ఎక్స్‌పోజింగ్ కి హద్దులు లేవనుకుంటే.. ఇప్పడు చేస్తున్న 'ఆర్.డి.ఎక్స్ లవ్'  అయితే బూతుకు మరోపేరులా కనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: