దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసు మరింత ఇబ్బంది పెడుతుంది. సినీ ప్రముఖులు దాదాపుగా ఈ వ్యవహారం నుంచి బయటపడటానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ , కన్నడ చిత్ర సీమ ఇలా ప్రతీ చోట కూడా ఈ డ్రగ్స్ కేసులు కంగారు పెడుతున్నాయి అనే కామెంట్ ఉంది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కి బాలీవుడ్ డ్రగ్స్ కి ఉన్న లింకులను బయటకు లాగే ప్రయత్నాలను చేస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా దీని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టాయి.

రాజకీయ నాయకుల మీద కూడా దృష్టి సారించింది డ్రగ్స్ కేసుని విచారిస్తున్న ఎన్సీబీ. ఇక ఇప్పుడు డ్రగ్స్ కేసుకి సంబంధించి ముంబై లో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ వద్ద  రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వ్యవహారం సంచలనం అయింది. ఈ పార్టీ నిర్వాహకులకు సమన్లను జారీ చేసారు. ఈరోజు రాత్రి 11 గంటల కంటే ముందే తమ ముందు హాజరు కావాలని వారిని అధికారులు ఆదేశించారు. నిన్న పార్టీ పై దాడి చేసిన తర్వాత 3 మహిళలతో సహా మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర డ్రగ్స్ బృందం... వారిని విచారిస్తుంది.

తమిళనాడు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో దాడులు నిర్వహించారు. ఇక ఈ వ్యవహారంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను ఆస్ట్రేలియా ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేసిన డ్రగ్స్ ముఠా మీద గట్టిగా దృష్టి పెట్టారు. ఎఫిడ్రిన్ తయారీ హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్లు విచారణలో వెల్లడి అయింది. ముంబై లోని అంతేరి లో  ఐదు కోట్ల విలువైన ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు.  మాదకద్రవ్యాల తయారీ అంతా హైదరాబాద్ లో జరుగుతుంది అని గుర్తించారు. మాదక ద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్ కు దిగుమతి చేసుకొని ఎఫిడ్రిన్ గా మార్చి అక్రమంగా దందా చేస్తున్నారు.  విదేశాలకూ హైదరాబాద్ నుండి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.  50,000 విలువచేసే ఎఫిడ్రిన్ ఆస్ట్రేలియా 5 లక్షలు పలుకుతున్నట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: