భారత్లో ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది. మొన్నటివరకు సెకండ్ వేవ్ కరోనా వైరస్ తో భారత్ ఎంతలా అల్లాడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలి అంటే భారత్లో ఏకంగా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అనే చెప్పాలి. ఎన్నో విపత్కర పరిస్థితుల నడుమ ఇక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తేవడంతో కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. అయితేఇక కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరిని కరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా కేంద్రం వ్యాక్సిన్ అందిస్తూ ఉండటం గమనార్హం.


 అయితే మొదట్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడిపోయిన జనాలు ఇక ఇప్పుడు వ్యాక్సిన్ పై పూర్తి స్థాయి అవగాహన రావడంతో   స్వచ్ఛందంగా వాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం.. అయితే ప్రస్తుతం భారత్లో కోవిషీల్డ్  వ్యాక్సిన్ ను ఇతర దేశాలు అంగీకరిస్తూ ఉన్నాయ్. కోవిషీల్డ్  వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకునే వారికి ఎలాంటి క్వారంటైన్ లేకుండానే వివిధ దేశాలు తమ దేశంలోకి భారత పౌరులను అనుమతిస్తూ ఉన్నాయి.


 అయితే ఇలాంటి సమయంలో ఇప్పటికి కూడా కొన్ని దేశాలు భారత్ లో వ్యాక్సిన్ కు అంగీకరించక పోవడం గమనార్హం. కాగా ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో చూసుకుంటే ఏకంగా టీకా సర్టిఫికెట్ను గుర్తించేందుకు భారత్తో 96 దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయి అన్నది ఇటీవలే భారత ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక మిగతా దేశాల నుంచి అంగీకారం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.. ఇలాంటి పరస్పర అంగీకారం ద్వారా విద్యా వ్యాపారం విదేశీ పర్యటనలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు అంటూ స్పష్టం చేస్తోంది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లేవారు కోవిన్ నుంచి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వంతెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: